
సాదా బైనామాలకు అవకాశం
● హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
● ‘భూభారతి’ చట్టంపై అవగాహన
హసన్‌పర్తి: భూభారతి చట్టం–25లో సాదా బైనామాలకు అవకాశం కల్పించిన ట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. భూ భారతి చట్టం–25పై గురువారం హసన్‌పర్తి మండలం ఎర్రగట్టు క్రాస్‌లోని బాలాజీ గార్డెన్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. 2014.. జూన్ కంటే ముందు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమిని సాదాబైనామా కింద కొని 2020 నవంబర్‌లో క్రమబద్ధీరణకు దరఖాస్తు చేసుకున్న వారు అర్హులని పేర్కొన్నారు. ఆర్డీఓ విచారణ జరిపి వారి నుంచి రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తారని తెలిపారు. ధరణిలో అప్పీలుకు అవకాశం ఉండేది కాదని, భూభారతి చట్టంలో అప్పీలు చేసుకునేందుకు రెండంచెల వ్యవస్థ రూపొందించినట్లు తెలిపారు.
‘భూభారతి’తో సమస్యల పరిష్కారం: ఎమ్మెల్యే నాగరాజు
భూభారతి చట్టం ద్వారా భూసమస్యలు పరిష్కారవుతాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. గత ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను రూపొందించి లక్షలాది ఎకరాల భూములను కబ్జా చేసిందని, బీఆర్‌ఎస్ నాయకులు కబ్జా చేసుకున్న భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు. భూభారతిలో రూపొందించిన మార్గదర్శకాలను ఆర్డీఓ రమేశ్ రాథోడ్ పవర్ పాయింట్ ప్రజెంటేన్ ద్వారా వివరించారు. ఈసందర్భంగా పలువురు రైతులు తాము ఎదుర్కొంటున్న భూ సంబంధిత సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ చల్లా ప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ రహీం, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పింగిలి వెంకట్రామ్‌నర్సింహారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు బిల్లా ఉదయ్‌కుమార్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, మేర్గు రాజేశ్, కార్పొరేటర్ దివ్యారాణి, శ్రీనివాస్‌రెడ్డి, తిరుపతి, వీసం సురేందర్‌రెడ్డి, వెంకటస్వామి, రత్నాకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు మదన్, అనిల్, జీవన్‌రెడ్డి, భగత్, కనపర్తి కిరణ్, పొన్నాల రఘు, రవీందర్ పాల్గొన్నారు.