
రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలి
వరంగల్: నర్సరీల్లో రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి నగర పరిధిలోని 18 వ డివిజన్ క్రిస్టియన్ కాలనీలోని నర్సరీని కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులు, నర్సరీని సక్రమంగా నిర్వహించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. బల్దియా పరిధి 9 నర్సరీల్లో 10 లక్షల మొక్కలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వర్షాకాలంలోగా నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో హెచ్‌ఓ లక్ష్మారెడ్డి, హార్టికల్టర్ అసిస్టెంట్ ప్రిన్సి తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగులైన యువతకు ఆర్‌వీవై
ఒక మంచి అవకాశం
నిరుద్యోగులైన యువతకు రాజీవ్ యువ వికాసం(ఆర్‌వైవీ) పథకం మంచి అవకాశమని కమిషనర్ డాక్టర్ అశ్వినీ తానాజీ వాకడే అన్నారు. సోమవారం వరంగల్ కాశిబుగ్గ సర్కిల్ కార్యాలయాన్ని కమిషనర్ ఆకస్మికంగా సందర్శించారు. సెలవు రోజున ప్రత్యేక కౌంటర్ ద్వారా స్వీకరిస్తున్న రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఆదివారం, సోమవారం స్వీకరించిన దరఖాస్తుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చివరి రోజైన సోమవారం సాయంత్రం 5 గంటల వరకు జీడబ్ల్యూఎంసీ పరిధిలో 10,254 దరఖాస్తులు స్వీకరించినట్లు కమిషనర్ తెలిపారు.
బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే