
ఒక్కడే..18 బైక్‌లు చోరీ
హసన్‌పర్తి: ఒకే యువకుడు వివిధ ప్రాంతాల్లో పార్క్ చేసిన 18 బైక్‌లు చోరీ చేశాడు. వాహనాల తనిఖీల్లో తప్పించుకునే క్రమంలో పోలీసులను చూసి పారిపోతుండగా అదుపులోకి తీసుకుని తీసుకుని విచారించగా ఈ విషయం బయటపడింది. ఇందుకు సంబంధించిన వివరాలను కాజీపేట ఏసీపీ తిరుమల్ బుధవారం విలేకరులకు వెల్లడించారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం ఫతేపూర్‌కు చెందిన గుగులోత్ చందూలాల్ కొంతకాలంగా 56వ డివిజన్ గోపాలపురంలో ఉంటున్నాడు. తన స్నేహితుడి ఐడీతో జొమాటో, స్విగ్గి, ర్యాపిడో సంస్థల్లో పనిచేస్తున్నాడు.అయితే ఆ ఆదాయం సరిపడక పోవడంతో సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనకు వచ్చి రద్దీ ప్రాంతాల్లో పార్క్ చేసిన వాహనాలను మాయం చేస్తున్నాడు. ఇందులో భాగంగా హనుమకొండ పీఎస్ పరిధిలో ఏడు, హసన్‌పర్తి పీఎస్ పరిధిలో మూడు, కేయూసీ పీఎస్ పరిధిలో ఒకటి, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ పరిధిలో నాలుగు, భువనగిరిలో రెండు, హైదరాబాద్‌లో ఒకటిచొప్పున ఎత్తుకెళ్లాడు.
ఇంటిలోనే చోరీ వాహనాలు..
హసన్‌పర్తి మండల కేంద్రంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసిన చందూలాల్ తప్పించుకునే క్రమంలో పట్టుకుని విచారించారు. చోరీ వాహనాలను ఫతేపూర్‌లోని తన ఇంటిలోనే భద్రపరిచినట్లు నిందితుడు అంగీకరించాడు. దీంతో అతడి ఇంటికెళ్లి 18 బైక్‌లు స్వాధీనం చేసుకున్న ట్లు ఏసీపీ తిరుమల్ చెప్పారు. కాగా, నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా, ఏసీపీ తిరుమల్, పోలీస్ ఇన్‌స్పెక్టర్ చేరాలు, ఎస్సై దేవేందర్, సిబ్బందిని వరంగల్ పో లీసు కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ అభినందించారు.
రద్దీ ప్రాంతాలే లక్ష్యం..
నిందితుడి అరెస్ట్
వివరాలు వెల్లడించిన కాజీపేట ఏసీపీ