
సత్తా చాటిన ధృవ కళాశాల విద్యార్థులు
వరంగల్ : వరంగల్ పోచమ్మమైదాన్‌లోని ధృవ బాలికల జానియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధించి ప్ర భంజనం సృష్టించారు. ఎంపీసీ ఫస్టియర్‌లో ఆయేషా 467 , హిబ్బాఖాన్ 466, సాఫియా హన్నన్ 466, కల్వచెర్ల భార్గవీ 465, బైపీసీ ఫస్టియర్‌లో తైసీన్ 435, చిందం ప్రణతీ 430, సీఈసీలో ఆయేషా మిర్జా 491, దొడ్ల రమ్య 487, ఎంపీసీ సెకండియర్‌లో శ్రీపాద అనుష్క 982, తంగపండి ఉదయ 980, బైపీసీలో జువేరియా ఫాతీమా 987, భూక్య సింధు 986, ఉమేజియా హఫ్సా 982 మార్కులు సాధించారు. సీఈసీలో రిదా మహీన్ 981, టస్కీన్ 980 లు ఉత్తమ ఫలితాలు సాధించారు. కళాశాల చైర్మన్ అకుల శ్రీనివాస్, డైరెక్టర్లు డాక్టర్ అకుల సంపత్, సతీష్‌కుమార్ మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించడంలో కృషి చేసిన అధ్యాపక బృందాన్ని, అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు.