
ఎకై ్సజ్ స్టేషన్ ప్రారంభోత్సవానికి బ్రేక్
కాజీపేట అర్బన్: ఈనెల మొదటి వారంలో ప్రారంభించాల్సి ఉన్న హసన్‌పర్తి ఎకై ్సజ్‌స్టేషన్ ప్రారంభోత్సవానికి బ్రేక్ పడింది. భవనాన్ని సైతం ముస్తాబు చేసిన సిబ్బందికి ఆదిలోనే హంసపాదు ఎదురైందని చర్చ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అబ్కారీ శాఖలో ఉన్న ఎకై ్సజ్ స్టేషన్లతో పాటు పాలనా సౌలభ్యానికిగాను మరో 14 ఎకై ్సజ్ స్టేషన్ల ప్రారంభోత్సవానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హనుమకొండ జిల్లాలో ఇప్పటికే కాజీపేట, హనుమకొండ, వరంగల్, ఖిలా వరంగల్, వరంగల్ అర్బన్ ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. హనుమకొండ ఎకై ్సజ్ స్టేషన్ పరిధి కొంత భాగాన్ని విడదీసీ నూతనంగా హసన్‌పర్తి ఎకై ్సజ్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. ప్రారంభం తాత్కాలికంగా వాయిదా పడింది.
బదిలీల్లేక సిబ్బంది కొరత
ఎకై ్సజ్ శాఖలో నూతనంగా ఏర్పాటు చేయనున్న హసన్‌పర్తి ఎకై ్సజ్ స్టేషన్‌కు ప్రత్యేకంగా అధికారులను కేటాయించేందుకు తొలుత ఎకై ్సజ్ బదిలీలను చేపట్టాల్సిన అవసరం ఉంది. బదిలీలు లేకపోవడంతో సిబ్బంది కొరతతో నూతనంగా హసన్‌పర్తి ఎక్సైజ్ స్టేషన్‌కు హనుమకొండ ఎక్సైజ్ స్టేషన్ సి బ్బంది ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించాల్సి ఉంటుంది.
హసన్‌పర్తి పరిధిలో ఇలా...
హనుమకొండ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో హనుమకొండ, హసన్‌పర్తి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాలతో పాటు గ్రేటర్ వరంగల్, హనుమకొండలోని డివిజన్లు 4, 5, 6, 8, 9, 50 నుంచి 54, 57 నుంచి 60, హసన్‌పర్తి పరిధి 1, 2, 55, 56, 66, 65 డివిజన్ల పరిధిలో ఉంటుంది. నూతనంగా హసన్‌పర్తి ఎకై ్సజ్ స్టేషన్‌కు హనుమకొండ మండలంలోని 4 నుంచి 10, 49, 50, 54 డివిజన్లతో పాటు హసన్‌పర్తి, కమలాపూర్ మండలాల పరిధిలో ఏర్పాటు కానుంది. అదే విధంగా హనుమకొండ ఎకై ్సజ్ స్టేషన్ పరిధి 25 వైన్స్, 41 బార్ల నుంచి సగం వరకు హసన్‌పర్తిలో కలవనున్నాయి.
నిఘా పటిష్టమవుతుంది..
నూతన ఎకై ్సజ్ స్టేషన్ ఏర్పాటుతో నిఘా పటిష్టమవుతుంది. మత్తు పదార్ధాల విక్రయం, గంజాయి సరఫరాపై నిరంతర నియంత్రణకు ఉపయోగపడుతుంది. త్వరలో హసన్‌పర్తి ఎకై ్సజ్ స్టేషన్‌ను ప్రారంభిస్తాం.
– చంద్రశేఖర్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్,
హనుమకొండ జిల్లా (వరంగల్‌అర్బన్)
ఆదిలోనే హంసపాదు
బదిలీలు లేక సిబ్బంది కొరత