
సుబేదారిలో కారు బోల్తా.. యువకుడి దుర్మరణం
● సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తుండగా ఘటన
వరంగల్ క్రైం: సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సమీపంలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వేగంగా వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు సుబేదారి ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ఇంటర్ మీడియట్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించాననే ఆనందంలో నమిండ్ల అభిషేక్ (18).. సెల్ఫ్ డ్రైవ్ కారు తీసుకుని స్నేహితులతో కలిసి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ వివరించారు.