
రైతులకు న్యాయం చేస్తాం..
వరంగల్ కలెక్టర్ సత్యశారద
వరంగల్: జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేస్తామని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. ఏనుగల్, తీగరాజుపల్లి గ్రామాల్లో హైవే నిర్మాణంలో భూమి కోల్పోయిన రైతులతో కలెక్టరేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన ఆర్బిటేషన్‌లో కలెక్టర్ మాట్లాడారు. జాతీయ రహదారి నిర్మాణంతో జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. నేషనల్ హైవే యాక్ట్‌ను అనుసరించి రైతులకు న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి తదితరులున్నారు.