
పీఆర్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
● వరంగల్ జెడ్పీ సీఈఓ రాంరెడ్డి
వరంగల్: జిల్లాలోని పంచాయతీరాజ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వరంగల్ జెడ్పీ సీఈఓ రాంరెడ్డి తెలిపారు. అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యలపై బుధవారం సీఈఓ రాంరెడ్డి ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా పీఆర్‌లోని ఆఫీస్ సబార్డినేట్లకు రికార్టు అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించకుండా.. ఇతర శాఖల నుంచి వచ్చిన వారి కోసం ఖాళీగా పెట్టినట్లు విమర్శలు వస్తున్నట్లు సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. రికార్డు అసిస్టెంట్ల పదోన్నతులతోపాటు కారుణ్య నియామకాలకు సంబంధించిన ఫైళ్లను క్లియర్ చేస్తామని సీఈఓ హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. సమావేశంలో పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం నాయకులు యుగేందర్, విజయపాల్‌రెడ్డి, రవికుమార్, రాజ్‌కుమార్, ఎలీషా తదితరులు పాల్గొన్నారు.
కక్కిరాలపల్లిలో వ్యక్తి ఆత్మహత్య
ఐనవోలు: ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన మండలంలోని కక్కిరాలపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై పస్తం శ్రీనివాస్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కత్తెరశాల చందర్(40) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో రెండో భార్య శ్వేతతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీనిపై మనస్తాపానికి గురైన చందర్ బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, చందర్‌కు మొదట మమతతో వివాహం జరగగా ఇద్దరు కుమారులు రాజేశ్, రోహిత్ జన్మించారు. చందర్‌తో మొదటి భార్య, కుమారులు వేరుగా ఉండడంతో సుమారు 10 సంవత్సరాల క్రితమే శ్వేతను రెండో వివాహం చేసుకున్నాడు. చందర్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని ఎస్సై తెలిపారు.

పీఆర్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం