
వేసవి జాగ్రత్తలకు చర్యలు
వరంగల్ : వేసవి వడగాలుల నుంచి రక్షణకు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. వేసవి వడగాల్పుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వరంగల్ కలెక్టర్ సత్యశారద అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలసి మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివి ధ ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చే యాలని అన్నారు. జూలై వరకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. జాగ్రత్తలను వివరిస్తూ ప్రచార బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. తాగునీటి సరఫరాకు జాగ్రత్త వ హించాలన్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. సాంస్కృతిక సారధి కళాకారులతో వడగాల్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. సమావేశంలో డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గణపతి, జిల్లా సహకార అధికారి నీరజ, ఆర్డీఓలు సత్యపాల్ రెడ్డి, ఉమారాణి, జీడబ్ల్యూఎంసీ డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ కలెక్టర్ సత్యశారద