
ఇంటర్మీడియట్‌లో ‘రెజోనెన్స్’ సత్తా
హన్మకొండ: ఇంటర్మీడియట్ ఫలితాల్లో రెజోనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో వరంగల్, హ నుమకొండలోని రెజోనెన్స్ జూనియర్ కళాశాలలు 90 రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని ఆ విద్యా సంస్థల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బీపీసీలో రాష్ట్ర ఫస్ట్ ర్యాంకుతోపాటు మొత్తం 80 రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినట్లు వివరించారు. నలుగురు విద్యార్థులు 470 మార్కులగాను 468 మార్కులతో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకుసాధించారని, 22 మంది విద్యార్థులు 470 మార్కులకు 467 మార్కులతో రాష్ట్ర స్థాయి రెండో ర్యాంకు సాధించారన్నారు. 21 మంది తృతీయ ర్యాంకు, 25 మంది రాష్ట్ర స్థాయి 4వ ర్యాంకు సాధించారని తెలిపారు. ద్వితీయ సంవత్సరంలోనూ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో జయకేతనం ఎగుర వేశారన్నారు. 21 మంది విద్యార్థులు రాష్ట్ర టాప్ మార్కులు, 995, 994, 993, 992, 991, 990తో పాటు మరిన్ని ఉత్తమ ర్యాంకులు సాధించారని వివరించారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో భూక్యా మనోజ్ కుమార్ 468, వేముల అనిక్షిత 468, గందె వర్ష 468, మంతిని సహస్ర 468 మార్కులు, ద్వితీయ సంవత్సరంలో నీలం నిక్షిత 995, బుర్ర అక్షిత 994, బీపీసీ మొదటి సంవత్సరంలో గండ్ర శ్రీజ 438, దావర్తి శ్రీనిధి 436, దర్ముల శ్రీతిక 436, ద్వితీయ సంవత్సరంలో ఎం.పూజశ్రీ 992, ఆర్.ఇక్షావర్ 992, డి.త్రిలోచన్ 992, ఎం.అస్మిత 992 మార్కులు సా ధించారని వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థా యి ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్, డైరెక్టర్లు, అధ్యాపకులు అభినందించారు. డైరెక్టర్లు లెక్కల మహేందర్ రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, సీఏఓ లెక్కల రమ్య, అకడమిక్ డీన్ గోపాలరావు, డీన్ కె.సాంబశివుడు పాల్గొన్నారు.