
మండుతున్న ఎండలు.. రోడ్లపైనే జనాలు
ఖిలా వరంగల్: వరంగల్ ఫోర్ట్ రోడ్డు పెట్రోల్ బంక్ జంక్షన్ వద్ద బస్ షెల్టర్ లేదు. ఖమ్మం, తొర్రూరు, నెక్కొండ, వర్ధన్నపేట వైపు వెళ్లాలంటే ఆరు డివిజన్లకు చెందిన ప్రజలు ఇక్కడే బస్ ఎక్కుతారు. షెల్టర్ లేక కూర్చోలేని, నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా వివిధ పనుల నిమిత్తం నగరానికి వచ్చిన గ్రామీణ ప్రాంత ప్రజలు తిరుగు ప్రయాణంలో అండర్‌బ్రిడ్జి జీప్ అడ్డా వద్ద బస్సులు ఎక్కి వెళ్తుంటారు. ఇక్కడికి వచ్చిన ప్రయాణికులు ఎండలో నిలబడి బస్సుల కోసం ఎదురు చూస్తుంటారు. ఎండలు మండుతుండడంతో రోడ్లపై నిలబడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.