
సమస్య సులువుగా గుర్తించొచ్చు
ఈదురుగాలులు, వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు విద్యుత్ లైన్‌లో సమస్యలు తలెత్తుతాయి. తద్వారా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగి వినియోగదారులు ఇబ్బందులు పడుతారు. ఈ నేపథ్యంలో డిజిటలైజేషన్ ద్వారా సమస్య ఎక్కడ తలెత్తిందో త్వరగా తెలుసుకోవచ్చు. బదిలీలు, నూతన నియామకాల సందర్భంగా కొత్తగా వచ్చే ఉద్యోగులు కూడా నంబరింగ్ ద్వారా సులువుగా తెలుసుకుంటారు. తద్వారా సిబ్బంది వెంటనే చేరుకుని వేగంగా సమస్యను పరిష్కరించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తారు. రైతులు, విద్యుత్ వినియోగదారులు ఏదేనీ సమస్య గుర్తించినప్పుడు విద్యుత్ సిబ్బందికి స్పష్టమైన సమాచారం అందించేందుకు ఫోల్ నంబరింగ్ దోహదపడుతుంది.