
గణితంతోనే అన్ని విభాగాల్లో పరిశోధనలు
కాజీపేట అర్బన్ : గణితశాస్త్రం అన్ని విభాగాలతో ముడిపడి ఉంటుందని, వివిధ విభాగాల్లో నూతన పరిశోధనలు, ఆవిష్కరణలు గణితంతోనే సాధ్యమని నిట్ ఇన్‌చార్జ్ డైరెక్టర్ ఎన్వీ.ఉమామహేశ్ తెలిపారు. నిట్ వరంగల్‌లోని హామిబాబా హాల్‌లో సోమవారం మ్యాథమెటికల్ డిపార్ట్‌మెంట్, ఐఐటీ బాంబే నేషనల్ సెంటర్ ఫర్ మేథమెటిక్స్, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ముంబయి సౌజన్యంతో వారం రోజుల టీచర్స్ ఎన్‌రీచ్‌మెంట్ వర్క్‌షాప్‌ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ–2020కి అనుగుణంగా ఉపాధ్యాయులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. ఇందుకు ఈ వారం రోజుల వర్క్‌షాప్ వేదికగా నిలవాలన్నారు. కార్యక్రమంలో నిట్ మ్యాథమెటిక్స్ డిపార్ట్‌మెంట్ హెడ్ సెల్వరాజ్, ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు