
భాషాపండితులకు సన్మానం
విద్యారణ్యపురి: రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత్ పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఏడాది ఉద్యోగ విరమణ పొందబోతున్న పలువురు భాషాపండితులను టెన్త్ స్పాట్‌లో సన్మానించారు. మూల్యాంకనం చేపడుతున్న ఫాతిమా హైస్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో డీఈఓ వాసంతి మాట్లాడుతూ టెన్త్ మూల్యాంకనంలో భాగస్వాములైన భాషాపండితుల సేవలను కొనియాడారు. రాష్ట్రీయ భాషా పండిత్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్లా మాట్లాడుతూ భాషా పండితులు అప్‌గ్రేడ్ కోసం కృషి చేయగా పదోన్నతులు లభించాయని గుర్తుచేశారు. ఆ పరిషత్ బాధ్యులు అంకేశ్వరపు కుమారస్వామి, బి. వెంకన్న, అల్లం నర్సయ్య, సదానందం, భిక్షపతి, లక్ష్మీనారాయణ, తిరుపతయ్య, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.