
అసంపూర్తిగా బస్ షెల్టర్
వరంగల్: వరంగల్ పోచమ్మమైదాన్ జంక్షన్ రత్నా హోటల్ సమీపంలో నిర్మిస్తున్న బస్ షెల్డర్ మూడు నెలలుగా అసంపూర్తిగా మారింది. స్మార్ట్ నిధులతో నగరంలో పలు షెల్టర్లు నిర్మించిన అధికారులు దీన్ని ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. అదే విధంగా గోపాలస్వామిగుడి జంక్షన్‌లోని ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న షెల్టర్‌ను తొలగించడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఎంజీఎం నుంచి పోచమ్మ మైదాన్ జంక్షన్ వరకు ఒక్క బస్ షెల్టర్ లేకపోవడంతో ప్రయాణీలకు నిలువ నీడ లేకుండా పోయింది.
షెల్టర్లు నిర్మించాలి..
నగరంలో ప్రయాణికులు బస్సుల కోసం నిరీక్షించేందుకు షెల్టర్లు లేకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ప్రతీ రెండు ఫర్లాంగులకు ఒక షెల్టర్ ఉండేది. ఇప్పుడు వాటి స్థానాల్లో పాన్‌షాపులు, పండ్ల బండ్లు పెట్టడం వల్ల షెల్టర్లు లేక ప్రయాణించేవారు ఇబ్బందులు పడుతున్నారు. – గుత్తికొండ రవి, కాశిబుగ్గ
●

అసంపూర్తిగా బస్ షెల్టర్