
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ అందరివాడు
అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలి
● వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
హన్మకొండ: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ అందరి వాడని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం హనుమకొండలోని ఆయన విగ్రహానికి ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ పి.ప్రావీణ్య, నగర మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి శ్రీలత, రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్ ఖుస్రు పాషా, మాజీ మేయర్ ఎరబ్రెల్లి స్వర్ణ, అధికారులు, ప్రజా సంఘాల నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా కడియం కావ్య మాట్లాడుతూ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ఆధారంగానే తమకు ఎంపీ, ఎమ్మెల్యేలుగా అవకాశాలు లభించాయన్నారు. ఆయన ఆలోచన విధానాన్ని గ్రామాల్లోని చివరి ఇంటి వరకూ తీసుకెళ్తున్నట్లు తెలిపారు.