
కమిషనరేట్ ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ సందర్శన
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్‌ను రామగుండం ట్రాఫిక్ పోలీసు అధికారులు సోమవారం సందర్శించినట్లు వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో నూతనంగా ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చే స్తుండడంతో, ఈ సెంటర్ నిర్వహణపై అధ్యయనం చేసేందుకు అక్కడి సీపీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు ట్రైనింగ్ సెంటర్‌ను సందర్శించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వహించాల్సిన రికార్డులు, డ్రంకన్‌డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహణ తదితర అంశాలను ఏసీపీ సత్యనారాయణ వారికి వివరించారు. కార్యక్రమంలో హనుమకొండ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సీతారెడ్డి, ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.