
అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు..
●వివాహిత నవ్య బలవన్మరణంపై
కేసు నమోదు
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నర్సంపేట బైపాస్ రోడ్‌లో ఆదివారం రాత్రి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన నవ్య మృతిపై ఆమె తండ్రి ఉత్తరాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ సోమవారం రాత్రి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని బ్రాహ్మణ బజార్‌కు చెందిన శ్రీపాద ఉత్తరాచారి పెద్ద కుమార్తె నవ్య (21)ను ఇల్లందు మండలం ధర్మారం తండాకు చెందిన తాడూరి భిక్షమాచారి, సత్యవతి దంపతుల కుమారుడు రవిచంద్రాచారికి ఇచ్చి గతేడాది డిసెంబర్ 26వ తేదీన వివాహం జరిపించారు. వివాహం సమయంలో రూ.50 వేలు కట్నం ఇచ్చారు. భర్త రవిచంద్రాచారి, అత్తామామ భిక్షమాచారి, సత్యవతి తరచూ అదనపు కట్నం కోసం నవ్యను వేధింపులకు గురిచేస్తుండేవారు. ఈ క్రమంలో పలుమా ర్లు పంచాయితీలు జరగగా అదనపు కట్నం డబ్బులు తర్వాత ఇస్తామని ఆపుకుంటూ వచ్చారు. ఆది వారం సాయంత్రం నవ్య తాను ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడుతున్నానని పక్కింటి వారికి చెప్పగా వారు హు టాహుటిన వచ్చి భర్త రవిచంద్రాచారికి చెప్పారు. అప్పటికే ఆమె ఇంట్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి ఉత్తరాచారి ఫిర్యాదు మేరకు టౌన్ ఎస్సై బి.విజయ్ కుమార్ కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కు టుంబీకులకు అప్పగించారని సీఐ తెలిపారు.
నేడు నగరంలో
విద్యుత్ ఉండని ప్రాంతాలు
హన్మకొండ: హనుమకొండలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ డీఈ జి.సాంబరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కంచరకుంట, కుడా కార్యాలయం, చింతల నర్సింహుల్ బుక్ స్టాల్ ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, శాంతినగర్, సుబేదారి, పోస్టల్ కాలనీ, ఎకై ్సజ్ కాలనీ, అదాలత్ కూడలి, అడ్వొకేట్స్ కాలనీ, హంటర్ రోడ్ ప్రాంతం, జూ పార్కు, వడ్డెపల్లి, విజయపాల్ కాలనీ, రాఘవేంద్ర కాలనీ ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫాతిమానగర్ ప్రాంతాల్లో ఉదయం 8 నంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని వివరించారు.
వరంగల్‌లో..
వరంగల్‌లోని మిల్స్ కాలనీ పోలీసు స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, ఏఎస్‌ఎం కళాశాల, దుర్గేశ్వర స్వామి దేవాలయం ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని వరంగల్ టౌన్ డీఈ ఎస్.మల్లికార్జున్ తెలిపారు. పిన్నవారి వీధి ప్రాంతంలో మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు, ఇంతేజార్‌గంజ్ పోలీసు స్టేషన్, విశ్వకర్మ వీధి, జేపీఎన్ రోడ్, ఎల్లంబజార్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు వివరించారు.

అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు..