
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు
వరంగల్ క్రైం: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడికౌశిక్‌రెడ్డిపై బెదిరింపుల హనుమకొండ సుబేదారి పోలీ స్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బెదిరింపులకు పాల్ప డుతూ దౌర్జన్యంగా, అక్రమంగా డబ్బులు డిమాండ్ చేస్తూ బూతులు తిడుతున్నాడని, తనతో ప్రాణ హాని ఉందని వ్యాపారవేత్త కట్ట మనోజ్‌రెడ్డి భార్య ఉమాదేవి మంగళవారం సుబేదారి పోలీసులకు ఫి ర్యాదు చేశారు. ఈ మేరకు కౌశిక్‌రెడ్డిపై కేసు నమో దు చేసినట్లు సుబేదారి ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. గతంలో ఎన్నికల సమయంలో మనోజ్‌రెడ్డి నుంచి కౌశిక్‌రెడ్డి రూ. 25 లక్షలు తీసుకున్నాడని, మరోసారి డబ్బులు కావాలని బెదిరింపులకు పాల్పడుతూ, ఫోన్‌లో బూతులు తిడుతున్నట్లు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. దీనిపై విచారణ చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
క్వారీ యజమానిపై ఫిర్యాదు
కమలాపూర్: మండలంలోని గుండేడు గ్రామస్తులు క్వారీ యజమాని మనోజ్‌రెడ్డిపై కమలాపూర్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. క్వారీ యజమాని మనోజ్‌రెడ్డి గ్రామ దేవాలయాల కోసం రూ.25 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చి కేవలం రూ.15 లక్షలు మాత్రమే ఇచ్చి మిగతా డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడని, ఈ విషయాన్ని గ్రామస్తులు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మనోజ్‌రెడ్డికి ఫోన్ చేయగా మనోజ్‌రెడ్డి ఎమ్మెల్యేతో అసభ్యంగా మాట్లాడి అవమానించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై స్థానిక సీఐ హరికృష్ణను వివరణ కోరగా తమకు ఫిర్యాదు అందిందని, దీనిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.