
వేయిస్తంభాల ఆలయంలో శనీశ్వరుడికి పూజలు
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో శనివారం త్రయోదశిని పురస్కరించుకుని శనీశ్వరుడికి పూజలు, శివకల్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేద పండితులు మణికంఠశర్మ, అర్చకులు సందీప్‌శర్మ, ప్రణవ్ ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు. మాసశివరాత్రి సందర్భంగా శ్రీరుద్రేశ్వరీ, రుద్రేశ్వరస్వామి ఉత్సవ విగ్రహలకు కల్యాణ తంతు నిర్వహించారు. ఆలయ ఈఓ డి.అనిల్‌కుమార్ పర్యవేక్షించారు.
బార్లకు దరఖాస్తుల వెల్లువ
కాజీపేట అర్బన్: గ్రేటర్ పరిధిలో రెన్యూవల్ కాకుండా మిగిలిన 4 బార్లకు దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. 490 దరఖాస్తులు జిల్లాలో, ఒక దరఖాస్తును హైదరాబాద్ ఎకై ్సజ్ కార్యాలయంలో సమర్పించారు. దీంతో 4 బార్లకుగాను 491 దరఖాస్తులు రాగా.. ఎకై ్సజ్‌శాఖ ఒక్కో దరఖాస్తుకు లక్ష రూపాయలు ఫీజుగా నిర్ణయించింది. 491 దరఖాస్తులకు 4.91 కోట్ల ఆదాయం సమకూరింది. ఈనెల 29న కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా ద్వారా బార్లను కేటాయించనున్నట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు.
వైద్య సేవలు
వినియోగించుకోవాలి..
ఎంజీఎం: ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య సూచించారు. జిల్లాలోని టేకులగూడెం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని శనివారం ఆయన సందర్శించి అందుతున్న వైద్య సేవల్ని పరిశీలించారు. వ్యాక్సిన్లు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, వృద్ధులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సోమిడిలోని యూపీహెచ్‌సీని పరిశీలించారు. అదేవిధంగా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విజయ్‌కుమార్ నగరంలోని బోడగుట్ట యూపీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో పల్లె దవాఖాన వైద్యులు జ్యోత్స్న, సోమిడి వైద్యాధికారి అనిత, బోడగుట్ట వైద్యాధికారి సృజన, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
మోడల్ స్కూళ్లలో
ప్రవేశాలకు నేడు పరీక్ష
విద్యారణ్యపురి: మోడల్ స్కూళ్లలో 6 నుంచి పదో తరగతి వరకు 2025–26లో ప్రవేశాలకు ఈనెల 27న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈమేరకు హనుమకొండ జిల్లాలో ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్ మోడల్‌స్కూళ్లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆరో తరగతిలో ప్రవేశాలకు ఈనెల 27న ఉదయం 10 గంటలకు 192 మంది అభ్యర్థులు ప్రవేశపరీక్ష రాయనున్నట్లు డీఈఓ వాసంతి తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆయా పరీక్ష కేంద్రాల్లో 7, 8, 9, 10 తరగతిలో ప్రవేశాలకు ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈప్రవేశ పరీక్షకు 152 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు ఆమె పేర్కొన్నారు.
వరంగల్ జిల్లాలో ఏర్పాట్లు
వరంగల్ జిల్లాలోని గీసుకొండ, బుధరావుపేట, అమీనాబాద్, గవిచర్ల, నెక్కొండ పర్వతగిరి మోడల్ స్కూళ్లను పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. ఆరో తరగతిలో ప్రవేశాల కోసం 310 మంది పరీక్షలు రాయనుండగా.. 7, 8, 9, 10 తరగతిలో ప్రవేశాలకు 195 మంది పరీక్షలు రాయనున్నట్లు డీఈఓ కార్యాలయం ఏసీజీ అరుణ తెలిపారు.
అత్యవసర సేవల ప్రాజెక్టు
మేనేజర్‌గా లక్ష్మణ్
హన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లా 108 102 1962 ప్రాజెక్ట్ మేనేజర్ మిర్యాల లక్ష్మణ్ నియమితులయ్యారు. ఇప్పటివరకు మేనేజర్‌గా పనిచేసిన శివకుమార్‌ను ఉమ్మడి ఖమ్మం జిల్లాకు బదిలీ చేశారు. శివకుమార్ మూడున్నర సంవత్సరాలనుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాల గ్రీన్ హెల్త్ సర్వీసెస్ అత్యవసర సేవలు 108, 102, గర్భిణుల కోసం, 1962 వెటర్నరీ అత్యవసర సేవల వాహనాలు, ఉచిత పార్థివ వాహనాల ప్రాజెక్టు మేనేజర్‌గా వ్యవహరించారు.

వేయిస్తంభాల ఆలయంలో శనీశ్వరుడికి పూజలు

వేయిస్తంభాల ఆలయంలో శనీశ్వరుడికి పూజలు