
వడదెబ్బతో ముగ్గురి మృతి
కాజీపేట: కాజీపేట రైల్వే జంక్షన్ ఆవరణలోని బస్టాండ్‌లో బుధవారం ఓ గుర్తుతెలియని వృద్దుడు వడదెబ్బతో మృతి చెందాడు. రైల్వే పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ జీవించే వ్యక్తి వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు స్థానికులు, పోలీసులు పేర్కొన్నారు. మృతుడి వయసు సుమారు 65 ఏళ్లు ఉంటాయని, మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించి భద్రపర్చినట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. వివరాలకు 87126–85122 నంబర్‌కు ఫో చేయాలని సీఐ కోరారు.
తిమ్మంపేటలో మహిళ ..
దుగ్గొండి: వడదెబ్బతో ఓ మహిల మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని తిమ్మంపేటలో జరిగింది. గ్రామానికి చెందిన నాంపల్లి రవళి అలియాస్ కల్పన (35) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తన ఇంటి పెరటితోటలో పనులు చేసింది. అనంతరం ఇంట్లోకి వచ్చిన కొద్ది సమయం తర్వాత అస్వస్థతకు గురైంది. దీంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలికి భర్త రాజేందర్, ఇద్దరు కూతుళ్లు జ్యోతిప్రియ, లక్ష్మీప్రసన్న ఉన్నారు.
ఘన్‌పూర్‌లో మరో మహిళ..
స్టేషన్‌ఘన్‌పూర్: వడదెబ్బతో ఘన్‌పూర్ డివిజన్ కేంద్రానికి చెందిన పులి రమ(50) మృతిచెందింది. మృతురాలి కుటుంబీకుల కథనం ప్రకారం.. రమ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నభోజన కార్మికురాలిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం వడదెబ్బ తగలడంతో తీవ్ర అస్వస్తతకు గురైంది. దీంతో కుటుంబీకులు హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

వడదెబ్బతో ముగ్గురి మృతి