విజన్ కళాశాల విజయదుందుభి
కాజీపేట అర్బన్ : ఇంటర్ ఫలితాల్లో హనుమకొండలోని విజన్ జూనియర్ కళాశాల విద్యార్థులు మరోసారి విజయదుందుభి మోగించారని కళాశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ ఎల్.నవనీతరావు మంగళవారం తెలిపారు. ఎంపీసీ సెకండియర్‌లో బొ మ్మిడేని వైష్ణవి 992, ఎ.సాయిరోహన్‌రాజు 989, బి.శ్రీరాజ్ 989, జి.ఆదిత్య 988, పి.స్నీతిక 979, మోక్షిణి 970, బీపీసీలో మొహసీనా అబ్రార్ 984, నాయిల్లా కౌసర్ 982, ధాత్రిక భరద్వాజ 975, ఫస్టియర్‌లో వైనాల లాస్య 466, కోడాతి హరిణి 465, పసునూరి దీక్షిత 464, కె.జెస్‌రాజ్ 463, లెస్లీ వెరోనికా సాయి 459 మార్కులను సాధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.


