
ఇంటర్‌లో బాలికల హవా
సెకండియర్‌లో 73.42%
విద్యారణ్యపురి: ఇంటర్‌లో బాలికల హవా కొనసాగింది. హనుమకొండ జిల్లాలో ఫస్టియర్ జనరల్ పరీక్షలకు 18,397 మంది విద్యార్థులు హాజరు కాగా 12,857 మంది (69.89 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలురు 9,600 మందికి 6,084 మంది (63.38 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 8,797 మందికి 6,773 మంది (76.99 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్, సెకండియర్‌లో హనుమకొండ జిల్లా రాష్ట్రంలో ఐదో స్థానం సాధించింది. గత ఏడాది ఇంటర్ ఫస్టియర్‌లో 62.41 శాత మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈసారి 7.48 శాతం ఉత్తీర్ణత పెరిగింది.
ఫస్టియర్ ఒకేషనల్‌లో..
ఒకేషనల్ ఫస్టియర్‌లో 1,146 మంది విద్యార్థులకు 744 మంది (64.92 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలురు 533 మందికి 301 మంది (56.47 శాతం), బాలికలు 613 మందికి 443 మంది (72.77 శాతం) ఉత్తీర్ణత సాధించారని హనుమకొండ డీఐఈఓ గోపాల్ తెలిపారు.
ఇంటర్ సెకండియర్ జనరల్‌లో..
ఇంటర్ సెకండియర్ జనరల్ విభాగంలో మొత్తం 17,587 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 12,912 మంది (73.42 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలురు 9,047 మందికి 6,180 మంది (68.31 శాతం), బాలికలు 8,540 మందికి 6,732 మంది (78.83 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణతలో బాలుర కంటే బాలికలదే పైచేయి ఉంది. గత ఏడాదిలో 73.23 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈఏడాది కూడా 73.42 శాతం స్వల్పంగా ఉత్తీర్ణత పెరిగింది.
సెకండియర్ ఒకేషనల్‌లో..
సెకండియర్ ఒకేషనల్ కోర్సుల్లో 892 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 689 మంది ఉత్తీర్ణత (77.24 శాతం) సాఽధించారు. బాలురు 419 మందికి 297 మంది (70.88 శాతం), బాలికలు 473 మందికి 392 మంది ఉత్తీర్ణత (82.88 శాతం) సాధించారు.
వరంగల్ జిల్లాలోనూ
బాలికల పైచేయి..
ఇంటర్ ఫలితాల్లో వరంగల్ జిల్లాలోనూ బాలికలదే పేచేయిగా ఉంది. ఇంటర్ ఫస్టియర్‌లో రాష్ట్రస్థాయిలో 19వ స్థానం, సెకండియర్‌లో 14వ స్థానంలో నిలిచింది. ఫస్టియర్‌లో జనరల్ విభాగంలో 4,967 మంది పరీక్షలకు హాజరుకాగా 2,890 మంది (58.18 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలురు 1978 మందికి 851 మంది ఉత్తీర్ణత (43.02 శాతం) సాధించారు. బాలికలు 2,989 మందికి 2,039 మంది (68.22 శాతం) ఉత్తీర్ణత సాధించారని డీఐఈఓ శ్రీధర్ సుమన్ తెలిపారు.
ఒకేషనల్ ఫస్టియర్ కోర్సుల్లో..
ఇంటర్ ఫస్టియర్‌లో ఒకేషనల్‌లో 847 మందికి 478 మంది పరీక్షలకు హాజరయ్యారు. 56.43 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
సెకండియర్ జనరల్‌లో..
సెకండియర్ జనరల్‌లో 4,743 మంది పరీక్షలు రాయగా 3,292 మంది (69.41 శాతం) ఉత్తీర్ణత సాఽఽధించారు. బాలురు 1,866 మందికి 1.029 మంది (55.14 శాతం) ఉత్తీర్ణత సాఽధించారు. బాలికలు 2,877 మందికి 2,263 మంది (78.66 శాతం) పాస్ అయ్యారు. బాలురకంటే బాలికలదే పైచేయి ఉంది.
సెకండియర్ ఒకేషనల్‌లో..
వరంగల్ జిల్లాలో ఇంటర్ ఒకేషనల్ కోర్సుల్లో మొత్తం 658 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరుకాగా అందులో 417 మంది ఉత్తీర్ణత ( 63.37 శాతం) సాధించారు.
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తులు
విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తులు చేసుకోవచ్చును. ఈనెల 23 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుంచి నిర్వహించనున్నట్లు ఇంటర్‌బోర్డు ప్రకటించింది. ఇంటర్ ప్రాక్టికల్స్ జూన్ 3 నుంచి 6 వరకు నిర్వహిస్తారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు ఈనెల 23 నుంచి 30 వరకు విద్యార్థులు చెల్లించాల్సి ఉంటుంది.
ఫస్టియర్‌లో 69.89%
హనుమకొండ జిల్లాలో గత ఏడాది కంటే
స్వల్పంగా పెరిగిన ఉత్తీర్ణత
సంవత్సరం ఫస్టియర్ సెకండియర్
2016 48 58.58
2017 61 70.7
2018 66 64.8
2019 66 64.33
2020 67 68.77
2021 51 –
2022 74 77.2
2023 71.6 73.73
2024 62.41 73.23
2025 69.89 73.42