గ్రావిటీ కళాశాల విజయఢంకా
కాజీపేట అర్బన్ : ఇంటర్ ఫలితాల్లో గ్రావిటీ జూ నియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మా ర్కుల ను సాధించి విజయఢంకా మోగించినట్లు కళాశాల చైర్మన్ మహేష్ మంగళవారం తెలిపారు. హనుమకొండ ప్రశాంత్‌నగర్‌లోని తెలంగాణ చౌరస్తా దగ్గర వద్ద గ్రావిటీ జూనియర్ కళాశాలలో విద్యార్థులను అభినందించి చైర్మన్ మాట్లాడారు. ఫస్టియర్ ఎంపీసీలో కె.అభినాష్ 470 మార్కులకు 467 మార్కులు, కె.అమూల్య, డి.రోహిణి, జి.చైతన్యలు 466 మార్కులు సాధించగా 30 మందికి పైగా విద్యార్థులు 460కిపైగా మార్కులు సాధించినట్లు తెలిపారు. బీపీసీ ఫస్టియర్‌లో 440 మార్కులకు కె.శ్రావ్య 436 మార్కులు, ఆర్.వైష్ణవి, ఈ.భార్గవసాయిలు 430 మార్కులు సాధించినట్లు తెలిపారు.సెకండియర్ ఎంపీసీలో కీర్తన 1000 మార్కులకు 995, సిహెచ్.సౌమ్య 992, బీపీసీలో జి.రాజేష్ నాయక్ 992 మార్కులను సాధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నరసింహారావు, డైరెక్టర్లు సందీప్, అమరేందర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, శ్రీకాంత్, వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


