
ఆర్మీలో చేరాలనుంది..
కబడ్డీ రాష్ట్రస్థాయిలో విజేతగా నిలిచా. హనుమకొండ జేఎన్‌ఎస్‌లో పలుమార్లు శిక్షణ తీసుకున్నా. ఈశిక్షణతో కబడ్డీలో విజేతగా నిలిచా. నాకు ఆర్మీలో ఉద్యోగం పొందాలని ఉంది. సమయాన్ని వృథా చేయకుండా సెలవుల్లో పుస్తకపఠనం చేస్తా.
– ఇట్టబోయిన గణేశ్, విద్యార్థి, వేలేరు
పలు రంగాల్లో
అవగాహన కల్పించాలి..
పిల్లలకు చదువుతోపాటు పలు రంగాల్లో ఆసక్తి కలిగేలా అవగాహన కలిగించి ప్రోత్సహించాలి. నాకు ఇద్దరు పిల్లలు అమ్మాయి, అబ్బాయి. వారిని రామకృష్ణ మఠంలో బాలసంస్కార్ క్లాస్‌కు పంపిస్తాను. విలువిద్య, స్విమ్మింగ్ నేర్పిస్తున్నా.
– చింత శ్యాంసుందర్, హనుమకొండ
పిల్లల్ని ప్రోత్సహిస్తా..
నాకు ఇద్దరు కుమారులు. గతంలో జిల్లా రంగ స్థల ఐక్యవేదిక వారు ఏర్పాటుచేసిన నటనలో ఉచిత శిక్షణ శిబిరం శిక్షణకు పంపించాను. బాబు కౌశిక్‌రాజ్ నాటక ప్రదర్శనలో అద్భుతంగా రాణించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉత్తమ బాలనటుడిగా అవార్డు అందుకున్నాడు.
– మాలి వాణి, గృహిణి, వరంగల్

ఆర్మీలో చేరాలనుంది..

ఆర్మీలో చేరాలనుంది..