
ఎంజీఎంలో ఎక్స్‌రే కష్టాలు..
ఎంజీఎం : ఉత్తర తెలంగాణ పేద రోగుల పెద్దది క్కు ఎంజీఎం ఆస్పత్రిలో నిత్యం ఏదో ఒక్క సమస్య తలెత్తుతూనే ఉంది. ఒక రోజు మందులు ఉండవు.. మరో రోజు వైద్యులు రారు. అన్ని బాగున్నాయి.. అనుకున్న క్షణమే పరికరాల్లో సాంకేతిక లోపమంటూ సేవలు అందవు.. ఇలా ఆస్పత్రిలో ఏ విభాగంలో చూసినా ఏదో సమస్య కనిపిస్తూనే ఉంటుంది. ఫలితంగా ఎంజీఎంకు వస్తే పూర్తి స్థాయి వైద్య చికిత్సలు అందుతాయా అనే నమ్మకం రోజురోజుకూ సన్నగిల్లుతోంది. ఈక్రమంలో మూడు రోజుల నుంచి ఆస్పత్రిలో అత్యంత కీలక విభాగమైనా క్యాజు వాలిటీలో ఎమర్జెన్సీ ఎక్స్‌రే సేవలు నిలిచాయి. ఈ సేవలను వెంటనే పునరుద్ధరణ చేయాల్సిన అవసరమన్నా రోజులు తరబడిగా పట్టించుకోవడం లేదు. ఫలితంగా క్షతగాత్రులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఒక పక్క ప్రమాదంలో విరిగిన కాళ్లు, చేతులతో ఆస్పత్రిలోని క్యాజువాలిటీ విభాగానికి వస్తే చికిత్స కోసం ఎక్స్‌రే పనిచేయకపోవడంతో ఇక్కడి నుంచి నుంచి ఓపీ బ్లాక్‌లో ఉన్న ఎక్స్‌రే గదికి క్షతగాత్రులను తరలించే సమయంలో వినబడుతున్న ఆర్తనాదాలు అందరినీ కంటతడిపెట్టిస్తున్నాయి.
చికిత్స కోసం తిప్పలు పడాల్సిందే..
ఎమర్జెన్సీ ఎక్స్‌రే పరికరం పనిచేయకపోవడంతో ఈ సేవల కోసం క్షతగాత్రుల బంధువులు తిప్పలు పడాల్సి వస్తోంది. క్షతగాత్రుడిని క్యాజువాలిటీ నుంచి ఓపీ బ్లాక్‌లోని 92 గదికి తరలించేందుకు వీల్ చైర్స్, స్ట్రెచర్స్ దొరకబట్టడానికి కుస్తీ పట్టాల్సిందే. ఆస్పత్రిలోని 92 గది ఎక్కడ అని తెలుసుకునేందుకు మరో ప్రయత్నం చేయాలి. చివరకు అక్కడికి వెళ్లాక ఒకే ఒక్క ఎక్స్‌రే పరికరం పనిచేస్తుండడంతో సేవల కోసం ఎదురుచూడాలి.. ఆ సమయంలో క్షతగాత్రుల రోదనలు చూడలేక సిబ్బందితో వా గ్వాదానికి దిగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా ఎంజీఎంలో అత్యవసర సేవల కోసం వచ్చిన క్షతగా త్రుల బాధలు నిత్యం పెరిగిపోతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోతున్నారు. ఉన్న ఒకే ఒక్క ఆర్‌ఎంఓ అన్ని పనులు చక్కబెట్టలేక చేతులేతేస్తున్న దుస్థితి. ఇప్పటికై నా ప్రభుత్వం, జిల్లా మంత్రులు స్పందించి ఎంజీఎంపై ప్రత్యేక దృష్టి సారించాలని రోగులు వేడుకుంటున్నారు.
ఆస్పత్రిలో నిలిచిన ఎమర్జెన్సీ ఎక్స్‌రే సేవలు
మూడు రోజులుగా ఆ గదికి తాళం
గాయాలతో క్షత్రగాత్రుల
నరకయాతన, ఆర్తనాదాలు
పట్టించుకోని ఆస్పత్రి ఉన్నతాధికారులు
మరమ్మతులు చేస్తాం..
ఎమర్జెన్సీ పరికరంలో సాంకేతిక లోపం ఏర్పడింది. ఎక్స్‌రే సేవలను 92 గదిలోని డిజిటల్ ఎక్స్‌రే ద్వారా అందిస్తున్నాం. ఎమర్జెన్సీ విభాగంలో ఎక్స్‌రే పరికరానికి మరమ్మతులు చేపడుతాం.
–కిశోర్, సూపరింటెండెంట్

ఎంజీఎంలో ఎక్స్‌రే కష్టాలు..