
స్విమ్మింగ్ పూల్ నిర్మాణం పూర్తి చేయండి
మేయర్ గుండు సుధారాణి
వరంగల్: బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలోని ఇండోర్ స్టేడియం సమీపంలో సుమారు రూ.1.50 కోట్లతో చేపట్టిన స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులను మేయర్ ఆకస్మికంగా తనిఖీ చేసి పనులు కొనసాగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యం సరికాదని మేయర్ అన్నారు. పనులు త్వరితగతిన పుర్తయ్యేలా ఇంజనీరింగ్ అధికారులు నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. స్విమ్మింగ్ ఫూల్ చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేయాలని హార్టికల్చర్ అధికారిని ఆదేశించారు. కార్యక్రమంలో హెచ్‌ఓ రమేశ్, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్, ఈఈ రవికుమార్, డీఈ రాజ్‌కుమార్, ఏఈ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.