ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలి
హన్మకొండ: రాజీవ్ యువ వికాసం అమలులో ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్ వివిధ శాఖల అధికారులతో రాజీవ్ యువ వికాసం పథకంపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. జిల్లాలో బీసీ, ఎస్సీ, ట్రైబల్, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా దాదాపు రూ.63 కోట్ల ద్వారా జిల్లాలో వివిధ యూనిట్లను నెలకొల్పేందుకు అర్హులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. మండల స్థాయి ఎంపిక కమిటీ మే 10 నాటికి ఎంపిక చేసి జాబితా సమర్పించాలన్నారు. సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనివాస్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శ్రీను, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, బీసీ వెల్ఫేర్ డీడీ రామ్‌రెడ్డి, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ మురళీధర్‌రెడ్డి, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి ప్రేమకళ, బ్యాంకర్లు పాల్గొన్నారు.
ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవాలి
ప్రతీ ఒక్కరూ ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవాలని కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. మహిళా శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండ కలెక్టరేట్‌లో పోషణ పక్షం వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ప్రావీణ్య జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రీ స్కూల్ విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో ఆర్జేడీ ఝాన్సీలక్ష్మీబాయి, జిల్లా సంక్షేమాధికారి జె.జయంతి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య, ఆయుష్ వైద్యుడు డాక్టర్ మహేందర్, జిల్లా న్యూట్రీషన్ స్పెషలిస్ట్ డాక్టర్ సరళ, సీడీపీఓలు విశ్వజ, స్వరూప, స్వాతి, పోషణ అభియాన్ జిల్లా కో–ఆర్డినేటర్ టి.సుమలత, జిల్లా మిషన్ శక్తి కో–ఆర్డినేటర్ డి.కళ్యాణి, సీనియర్ అసిస్టెంట్ వి.వెంకట్రాం, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ సింధురాణి, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఇన్‌చార్జ్ అధికారి ఎస్.ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
రాజీవ్ యువ వికాసం అర్హులకు
బ్యాంకు ద్వారా రాయితీ అందించాలి
హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య


