
మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో వడ్ల వ్యాపారం చేసే ఓ తండ్రికి చదువు రాదు. అతడి కుమారుడు ఇంటర్‌తో చదువు ఆపేశాడు. గంజాయి అలవాటైంది. తండ్రి వ్యాపారానికి సంబంధించి ఫోన్ పే, గూగుల్ పేను ఆ కొడుకు నిర్వహిస్తాడు. గంజాయికి డబ్బులు అవసరమైనప్పుడల్లా తండ్రికి తెలియకుండా కుమారుడు డబ్బులు వాడేశాడు. ఇలా వేయి, రెండు వేలు కాదు.. రూ.2.50 లక్షలు కాజేశాడు. ఈ క్రమంలో ఇటీవల పోలీసుల దాడిలో సదరు యువకుడు గంజాయి తాగుతూ దొరికాడు. గంజాయికి డబ్బులు ఎలా వస్తున్నాయని పోలీసులు కౌన్సెలింగ్ చేస్తే విషయం బయటపడింది. అసలు విషయం తెలిశాక కొడుకును ఏం అనాలో ఆ తండ్రికి అర్థంకాని పరిస్థితి.
హనుమకొండ నయీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థికి సెకండియర్‌లో స్నేహితులతో గంజాయి అలవాటైంది. ఫైనలియర్ వచ్చేసరికి వ్యసనంగా మారింది. తండ్రి కళాశాల ఫీజు కింద ఇచ్చిన రూ.20వేలు గంజాయికి ఖర్చుపెట్టాడు. ఆ తరువాత ప్రైవేట్ లోన్‌యాప్ ద్వారా మరో రూ.30వేలు తీసుకున్నాడు. ఆ తరువాత కళాశాల, పరీక్షల ఫీజు కోసం ఇచ్చిన మరో రూ.20 వేలు గంజాయి కోసం ఖర్చు చేశాడు. చివరకు పరీక్ష ఫీజు కట్టలేదు. పరీక్షలు రాయలేదు. ఆ విద్యార్థి ఇటీవల పోలీసులకు చిక్కగా విషయం బయటపడడంతో తండ్రి బోరున విలపించాడు. కానీ, ఆ విద్యార్థి గంజాయి మత్తునుంచి ఇంకా బయటకు రాలేదు.
న్యాయమూర్తికి
వీడ్కోలు సన్మానం
వరంగల్ లీగల్ : హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేష్‌బాబు బదిలీపై వెళ్తున్న సందర్భంగా సోమవారం వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబతోపాటు న్యాయమూర్తులు, రెండు జి ల్లాల బార్ అసోసియేషన్ల బాధ్యులు జడ్జి రమేష్‌బాబు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ల అధ్యక్షులు వలుస సు ధీర్, పులి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులు రమాకాంత్, కొత్త రవి, బార్ కౌన్సిల్ మెంబర్ జయపాల్, న్యాయవాదులు పాల్గొన్నారు.
పోలీస్ క్రీడాకారులకు
ప్రోత్సాహం అందిస్తాం
వరంగల్ క్రైం : జాతీయస్థాయి క్రీడల్లో రాణించే పోలీస్ క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. గత నెలలో మధ్యప్రదేశ్ ఇండోర్‌లో జరిగిన 18వ జాతీయ పోలీస్ షూటింగ్ (స్పోర్ట్స్) చాంపియన్ షిప్‌లో తెలంగాణ పోలీస్ తరఫున ప్రాతినిధ్యం వహించి 300 మీటర్ల మహిళా జట్టు విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన సుబేదారి ఏఎస్సై సువర్ణను సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో సీపీ ఘనంగా సత్కరించారు. పరిపాలన విభాగం అదనపు డీసీపీ రవి పాల్గొన్నారు.
నేడు విద్యుత్ హనుమకొండ
ఎస్‌ఈతో ‘ఫోన్ ఇన్’
హన్మకొండ: విద్యుత్ సరఫరా, నూతన సర్వీస్ మంజూరుపై ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి.మధుసూదన్‌రావు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు 94910 75110 నంబర్‌కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు అందించాలని, సమస్యలు తెలపాలని కోరారు.
కొనసాగుతున్న
ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. మొత్తం 34 కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన టెన్త్ పరీక్షలకు 2,041 మంది విద్యార్థులకుగాను 1775మంది హాజరయ్యారు. 266మంది గైర్హాజరయ్యారు. ఇంటర్‌లో 4,238మందికి 3,802మంది హాజరుకాగా, 436మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ఆనగోని సదానందం తెలిపారు. రాష్ట్ర పరిశీలకులు అనురాధ, కె.విజయ్‌కుమార్ సోమవారం హనుమకొండ జిల్లాలోని పరకాల ప్రభుత్వ పాఠశాల, జెడ్పీ బాలుర పాఠశాల, ఎస్‌ఆర్ స్కూల్ కేంద్రాలను తనిఖీచేశారు. మరో ముగ్గురు రాష్ట్ర పరిశీలకులు ఎ.శ్రీనివాస్, దామోదర్‌రెడ్డి, ఎ.విజయమోహన్ ములుగు జిల్లాలోని పరీక్ష కేంద్రాలను సందర్శించారు.
● ఇంట్లోవాళ్ల కళ్లు గప్పి
డబ్బులు వాడేస్తున్న విద్యార్థులు
● పోలీసుల విచారణలో తెలిశాక కంగుతింటున్న తల్లిదండ్రులు
● ఆరెపల్లి రింగ్ రోడ్డు
అడ్డాగా గంజాయి
సరఫరా
● ద్విచక్ర
వాహనాలతో
స్టూడెంట్స్ అంటూ
బురిడీ
వరంగల్ క్రైం:
పెళ్లి బరాత్ అంటేనే యువతలో జోష్ నిండుకుంటుంది. తల్లిదండ్రులకు తెలియకుండా స్నేహితులతో ఓ బీర్. ఇది చాలా పెళ్లిళ్ల సమయంలో కనిపించే సీన్. కానీ రోజులు మారుతున్నాయి. బరాత్ తీరు మారుతోంది. పార్టీకి సంబంధించి స్నేహితులు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. ఏకాంతంగా జరుపుకుంటున్నారు. తల్లిదండ్రులతోపాటు అందరి కళ్లు కప్పి మత్తులో తూగుతున్నారు. అదీ గంజాయి మత్తులో. మరి వీరికి డబ్బులు ఎలా వస్తున్నాయని ఆరా తీస్తే కళ్లు చెదిరే నిజాలు తెలుస్తున్నాయి. కాలేజీ ఫీజుల పేరుతో ఇంట్లో వారి కళ్లు గప్పి డబ్బులు వాడేసుకుంటున్న వారు కొందరైతే.. ఏకంగా లోన్‌యాప్‌లలో రుణాలు తీసుకుంటున్న వారు మరికొందరు ఉన్నారు. ఇటీవల హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌లో పరిధి ఓ గ్రామంలోని ఓ గదిలో రహస్యంగా గంజాయి సేవిస్తున్న ఐదుగురు యువకులను నార్కోటిక్స్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసే వరకు వారు గంజాయి సేవించినట్లు గ్రామంలో ఎవరికి తెలియదు. ఆ ఐదుగురిలో ఓ మైనర్ ఉండడం గమనార్హం. వీరికి పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహిస్తే అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆరేపల్లి రింగ్‌రోడ్డు అడ్డాగా..
ఆంధ్రప్రదేశ్, ఛతీస్‌గఢ్ రాష్ట్రాలనుంచి విచ్చలవిడిగా వస్తున్న గంజాయి ఆరేపల్లి రింగ్ రోడ్డు నుంచి ట్రైసిటీలోని వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతున్నట్లు సమాచారం. ప్రధానంగా ద్విచక్ర వాహనా లపై గంజాయిని ఆరేపల్లి కెనాల్ మీదుగా పోచమ్మ మైదాన్, ఓఆర్‌ఆర్ మీదుగా ఎర్రగట్టుగుట్ట, యాదవనగర్ మీదుగా హనుమకొండ చౌరస్తా, ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతున్నట్లు సమాచారం. ఈ తంతు కొన్నేళ్లుగా సాగుతున్నా పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. స్కూటీల్లో టిఫిన్ బాక్సులను పెట్టుకుని తరలిస్తున్నారు. విద్యార్థుల మాదిరిగా స్కూటీ వాహనాలు నడుపుతూ.. బ్యాగులు ధరించి ఉండడం వల్ల పోలీస్ అధికారులు స్టూడెంట్స్ అని వదిలిపెడుతున్నారు. కానీ.. కొంత మంది విద్యార్థులే గంజాయి సరఫరా చేస్తున్నట్లు ఇటీవల పోలీసులు గుర్తించారు. ఇంజనీరింగ్, కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి అమ్మకాలను సాగిస్తున్నట్లు తెలిసింది. గంజాయి అలవాటు ఉన్నవారే డబ్బుల కోసం చిన్నచిన్న మొత్తంలో గంజాయిని పక్క రాష్ట్రాలనుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్లు తెలిసింది.
● రిసోర్స్ పర్సన్ల నియామకానికి
దరఖాస్తుల ఆహ్వానం
● డీఈఓ కార్యాలయాల్లో స్వీకరణ
● నేటినుంచి ఈనెల 24వరకు గడువు
● ఇంటర్వ్యూ, డెమో ద్వారా ఎంపికలు
మాట్లాడుతున్న మేయర్ గుండు సుధారాణి
న్యూస్‌రీల్
గంజాయి కొనుగోలుకు లోన్‌యాప్‌లో యువత రుణాలు
రుణ ఉచ్చులో యువత
డిగ్రీ, ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు గంజాయి తాగటానికి డబ్బులు లేకపోవడంతో ప్రైవేట్ లోన్‌యాప్ ఉచ్చులో చిక్కుతున్నారు. ఎం ప్యాకెట్, బడాబ్రో, క్రెడిట్ బీ, క్యాష్‌బీన్ వంటి లోన్ యాప్‌లు యువతను అకర్షిస్తున్నాయి. డిగ్రీ ఐడీకార్డును ఆప్‌లోడ్ చేస్తే రూ.20 వేల నుంచి రూ.30వేలు ఇస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగులు అయితే రూ.20 వేల నుంచి రూ.50 వేలు ఇస్తున్నారు. దీంతో చేతికి డబ్బులు అందడంతో గంజాయిని కొనుగోలు చేసి తాగుతున్నారు.
ఈ నెలలో పట్టుబడిన కేసులు
హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 14న గంజాయి, హాష్ ఆయిల్‌తో పట్టుబడిన కోటగిరి సాయి వినయ్, లావుడ్య రవీందర్, గుగులోత్ హరిసింగ్‌ను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.5లక్షల విలువైన గంజాయి, రూ. 2.50 లక్షల విలువైన హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈనెల 17న పరకాల పోలీసులు రూ. 3 లక్షల విలువైన 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఒడిషాకు చెందిన నిందితులను అరెస్టు చేశారు.
ఈనెల 11న హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబ్బాల వద్ద ముగ్గురు యువకులను అరెస్ట్ చేసి వారినుంచి ఒక కిలో 730 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఈనెల 8న హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు యువకులతోపాటు ఓ మైనర్ బాలుడిని, మరో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈనెల 3న హనుమకొండ బస్టాండ్ దగ్గర ఆటోలో గంజాయితో ఉన్న గుజరాత్‌కు చెందిన గౌతమ్ భరత్‌సిండేను తనిఖీ చేయగా అతడి దగ్గర 16 కిలోల ఎండు గంజాయి లభించింది.

మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025