తెలుగు విభాగంలో ‘బదిలీ’ వివాదం | - | Sakshi
Sakshi News home page

తెలుగు విభాగంలో ‘బదిలీ’ వివాదం

Apr 17 2025 1:08 AM | Updated on Apr 17 2025 1:08 AM

తెలుగు విభాగంలో ‘బదిలీ’ వివాదం

తెలుగు విభాగంలో ‘బదిలీ’ వివాదం

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలోని తెలుగు విభాగంలో బదిలీ వివాదం నెలకొంది. ఓ తెలుగు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ బదిలీపై జరిగిన డిపార్ట్‌మెంటల్‌ సమావేశంలో విభాగాధిపతి తీరుపై మిగతా సభ్యులు అభ్యంతరం తెలుపుతూ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేసే వరకు వెళ్లారు. ఈ వివాదానికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. యూనివర్సిటీ పరిధి హనుమకొండలోని ఆర్ట్స్‌అండ్‌ సైన్స్‌ కళాశాల తెలుగు విభాగంలో కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా 13 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సదాశివ్‌ తనను యూనివర్సిటీ క్యాంపస్‌కు బదిలీ చేయాలని కొన్నినెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం దృష్టికి పలుసార్లు తీసుకెళ్లారు. తెలుగు విభాగం అధిపతికి కూడా వినతిపత్రం సమర్పించారు. ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ నుంచి సదాశివ్‌ను బదిలీ చేయాలంటే డిపార్ట్‌మెంటల్‌ కమిటీ (డీసీ) సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. క్యాంపస్‌లోని తెలుగ విభాగం నుంచి మరో కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ను ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీకి బదిలీ చేయాల్సి ఉంటుంది. క్యాంపస్‌లో తెలుగు విభాగంలో ఓ కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 14 ఏళ్లుగా పనిచేస్తున్నారు. అతడిని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీకి, తనను క్యాంపస్‌లోని తెలుగు విభాగానికి బదిలీ చేయాలని కోరుతూ వస్తున్నారు.

డిపార్ట్‌మెంటల్‌ కమిటీ సమావేశంలో రచ్చ

సదాశివ్‌ బదిలీపై ఇటీవల కేయూ తెలుగు విబాగం అధిపతి, కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ లింగయ్య డిపార్టుమెంటల్‌ కమిటీ(డీ.సీ) సమావేశం నిర్వహించారు. ఇందులో యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్‌ టి.మనోహర్‌ మరో రెండు విభాగాలకు విభాగాల అధిపతులు (రెగ్యులర్‌ మహిళా ఆచార్యులు) సభ్యులుగా పాల్గొన్నారు. తెలుగు విభాగంలో 2013లో అప్పటి డిపార్టుమెంటల్‌ కమిటీ సదాశివ్‌ను మహబూబాబాద్‌ పీజీ సెంటర్‌కు బదిలీ చేయాలని నిర్ణయించిందని, ఇప్పుడు మహబూబాబాద్‌ పీజీ సెంటర్‌కు బదిలీ చేద్దామనేది తెలుగు విభాగం అధిపతి లింగయ్య పేర్కొన్నారు. అప్పటి డీసీ నిర్ణయం ఇన్ని సంవత్సరాల తర్వాత అమలు చేయడం సరికాదని, నూతనంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ప్రొఫెసర్‌ మనోహర్‌ సూచించారు. దీన్ని లింగయ్య విభేదించారు. అంతేకాకుండా మనోహర్‌ సూచనలను వ్యతిరేకిస్తూ అమర్యాదగా ప్రవర్తించారని, ఆయన మాటను ఖాతరు చేయకుండా విభాగాధిపతి వ్యవహరించిన తీరుతో సమావేశం నుంచి మనోహర్‌తోపాటు మరో ఇద్దరు ఆచార్యులు వెళ్లిపోయారు. లింగయ్య తీరుపై లిఖితపూర్వకంగా కేయూ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారు. ఈవిషయాన్ని బుధవారం ప్రొఫెసర్‌ మనోహర్‌ ధ్రువీకరించారు. తెలుగు విభాగాఽధిపతిగా ఉన్న కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌పై రిజిస్ట్రార్‌ దృష్టికి వెళ్లినా ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని, తనను బదిలీ చేయడం లేదని సదాశివ్‌ రిజిస్ట్రార్‌, వీసీలను కలిసి తన ఆవేదన వ్యక్తం చేశారు.

సదాశివ్‌ను బదిలీ చేయడంలో తాత్సారం

డీసీ మీటింగ్‌లో విభాగాధిపతి తీరుపై విస్మయం

రిజిస్ట్రార్‌కు ప్రిన్సిపాల్‌ మనోహర్‌ ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement