
కులనిర్మూలనకు కృషి చేసిన మహనీయుడు అంబేడ్కర్
హన్మకొండ: సమాజంలో అంటరానితనం, కుల నిర్మూలనకు కృషి చేసిన మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ అని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ కార్యాలయం ఆవరణలోని స్పోర్ట్స్ క్లబ్‌లో తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. 150 మంది విద్యుత్ ఉద్యోగులు రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని సీఎండీ ప్రారంభించారు. అంతకు ముందు అంబేడ్కర్ చిత్రపటానికి ఆయన, డైరెక్టర్లు, అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ రాజ్యాంగం మనుగడలో ఉన్నంతకాలం అంబేడ్కర్ పేరు చిర స్థాయిలో నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు ఎ.ఆనందం, కార్యదర్శి ఎన్.కుమారస్వామి, ఫైనాన్స్ సెక్రటరీ నర్సింహారావు, టీజీ ఎన్పీడీసీఎల్ ఇన్‌చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, వి.తిరుపతి రెడ్డి, సీజీఆర్‌ఎఫ్ నిజామాబాద్ చైర్మన్ ఇ. నారాయణ, హనుమకొండ ఎస్‌ఈ పి.మధుసూదన్ రావు, డి.ఈలు విజేందర్ రెడ్డి, సామ్యనాయక్, జి.సాంబరెడ్డి, ఎస్.మల్లికార్జున్, భిక్షపతి పాల్గొన్నారు.
● టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి