19 నుంచి బునియాడీ కార్యకర్తల సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

19 నుంచి బునియాడీ కార్యకర్తల సమ్మేళనం

Apr 18 2025 1:12 AM | Updated on Apr 18 2025 1:12 AM

19 ను

19 నుంచి బునియాడీ కార్యకర్తల సమ్మేళనం

హన్మకొండ: హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు జరిగే బునియాడీ కార్యకర్తల సమ్మేళనం విజయవంతం చేయాలని ఆదివాసీ కాంగ్రెస్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు గుగులోత్‌ రవీందర్‌ నాయక్‌ పిలుపునిచ్చారు. అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ, ఆదివాసీ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లయ్య నాయక్‌ ఆదేశాల మేరకు ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పీసీసీ డెలిగేట్లు పాల్గొంటారని వివరించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ప్రతీ మండలం నుంచి ఆదివాసీ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఈ సమ్మేళనంలో పాల్గొనాలని కోరారు.

యువకుడిపై

పోక్సో కేసు నమోదు

వరంగల్‌: మూడేళ్ల చిన్నారిపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఇంతేజార్‌గంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎంఎ.షుకూర్‌ తెలిపారు. బుధవారం రాత్రి గిర్మాజీపేటలో కిరాయికి ఉంటున్న ఓ కుటుంబానికి చెందిన మూడేళ్ల చిన్నారి తన నానమ్మ వద్ద అన్నం తిని ఇంటి ఆవరణలో అన్నయ్యతో ఆడుకుంటోంది. వీరు ఉంటున్న ఇంట్లోనే పైఅంతస్తులో కిరాయికి ఉంటూ పెయింటింగ్‌ వర్క్‌ చేసే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన లల్లు రంజాన్‌.. ఇద్దరు పిల్లలను బయటకు తీసుకెళ్లి బిస్కెట్‌లు కొనిచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి బాలికలను పైఅంతస్తులోని తన గదికి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయం బాలిక తన నానమ్మతో చెప్పగా కుటుంబ సభ్యులు రంజాన్‌ను నిలదీయగా పరారయ్యాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు రంజాన్‌పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

వడగళ్ల వానతో పండ్ల తోటలకు నష్టం

ఖిలా వరంగల్‌: వరంగల్‌ జిల్లాలో ఇటీవల ఈదురు గాలులతో కురిసిన వడగళ్ల వానకు పండ్ల తోటలకు నష్టం వాటిల్లింది. మామిడికాయలు రాలిపోగా, అరటి, బొప్పాయి, మునగ తోటలు నేలవాలాయి. జిల్లాలో మొత్తం 502 ఎకరాల విస్తీర్ణంలో పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. ఇందులో 37 ఎకరాల మామిడి, 33 ఎకరాల అరటి తోటలు, రెండు ఎకరాల బొప్పాయితోపాటు మిగిలినవి ఇతర పంటలు ఉన్నాయి. బుధ, గురువారం వివరాలు సేకరించామని జిల్లా ఉద్యానశాఖ అధికారులు తెలిపారు.

19 నుంచి బునియాడీ కార్యకర్తల సమ్మేళనం
1
1/1

19 నుంచి బునియాడీ కార్యకర్తల సమ్మేళనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement