
మే 1 నుంచి వేసవి క్రీడాశిక్షణ శిబిరాలు
వరంగల్ స్పోర్ట్స్: పట్టణ పరిధిలో వేసవి క్రీడాశిక్షణ శిబిరాలను మే 1 నుంచి 31 వరకు నిర్వహించనున్నట్లు హనుమకొండ డీవైఎస్‌ఓ గుగులోత్ అశోక్‌కుమార్ తెలిపారు. శిబిరాల నిర్వహణ, క్రీడాకారుల నమోదు అంశంపై మంగళవారం హనుమకొండ ఇండోర్ స్టేడియంలోని డీఎస్‌ఏ కార్యాలయంలో కోచ్‌లతో డీవైఎస్‌ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్‌కుమార్ మాట్లాడుతూ శిబిరాలకు విద్యార్థులను తీసుకొచ్చేలా ఒక్కొ కోచ్‌కు 10 పాఠశాలలను అప్పగించినట్లు తెలి పారు. ఆయా కోచ్‌లు పాఠశాల హెచ్‌ఎంలు, ప్రిన్సి పాళ్లతో మాట్లాడి నాలుగు నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు శిబిరాల్లో పాల్గొనేలా చూడాలని సూచించారు. శిక్షణ శిబిరాల్లో పాల్గొనే విద్యార్థులు ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తులను ఇండోర్ స్టేడియంలో అందజేయాలని తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనేలా, వేసవి సెలవులను వృథా చేయకుండా ఆసక్తి గల క్రీడాంశాల్లో శిక్షణ అందించేలా చొరవ చూపాలని తల్లిదండ్రులను కోరారు. సమావేశంలో కోచ్‌లు శ్రీమన్నారాయణ, వెంకటేశ్వర్లు, విష్ణువర్ధన్, అఫ్జల్, జీవన్‌గౌడ్, ప్రభుదాస్, శంకర్, రమేశ్, ప్రశాంత్, నరేందర్, నవీన్‌కుమార్, రమేశ్ పాల్గొన్నారు.