
ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌గా రాజేందర్ ఎన్నిక
హన్మకొండ చౌరస్తా: ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్‌గా టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఎన్నికయ్యారు. హనుమకొండ అలంకార్ జంక్షన్‌లోని టీఎన్జీఓస్ భవన్‌లో టీఎన్జీఓ, టీజీఓ, ఉపాధ్యాయ, నాలుగో తరగతి ఉద్యోగులు, కార్మిక, పెన్షనర్ల, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ సంఘాల నాయకుల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా కమిటీని ఎన్నుకున్నారు. చైర్మన్‌గా రాజేందర్, కన్వీనర్‌గా టీజీఓ జిల్లా అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, కోకన్వీనర్‌గా పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, గౌరవ అధ్యక్షుడిగా టీజీఓ నాయకుడు ఎ.జగన్మోహన్‌రావుతోపాటు మిగిలిన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జేఏసీ నేతలు బైరి సోమయ్య, డాక్టర్ ప్రవీణ్, శ్రీహరి, శ్రీనివాస్, పుల్లూరు వేణుగోపాల్, పనికెల రాజేశ్, సర్వర్ హుస్సేన్, శ్యాంసుందర్, గోపాల్‌రెడ్డి, రవీందర్, పెండెం రాజు, రాంబాబు పాల్గొన్నారు.