విజయభేరి మోగించిన ఆర్‌డీ కళాశాల
నయీంనగర్ : ఇంటర్ ఫలితాల్లో ఆర్.డి. కళాశాల విజయభేరి మోగించింది. ఎంపీసీ సెకండియర్ ఫలితాల్లో 992 మార్కులు, బైపీసీలో 991 మార్కులు సాధించడంతో పాటు, 8 మంది 980 మార్కులకు పైగా సాధించారని కళాశాల యాజమాన్యం తె లిపింది. గత రెండు దశాబ్దాలుగా ఆర్.డి కళాశాల ఇంటర్ ఫలాతాల్లో రాష్ట్రస్థాయి మార్కులు సాధిస్తూ తన స్థానం ఉన్నతంగా నిలుపుకుందని తెలిపారు. ఎంపీసీ ఫస్టియర్‌లో 467, 466, 466, 466 అత్యుత్తమ మార్కులు సాధించారు. బైపీసీ ఫస్టియర్‌లో 429, 425 మార్కులు సాధించారు. అద్భుత విజయాలను సా ధించిన విద్యార్థులను, అంకితభావంతో పనిచేసిన అధ్యాపకులను, సహకరించిన విద్యార్థుల తల్లితండ్రులను యాజమాన్యం డాక్టర్ కోడూరి రామమూర్తి, బండి మల్లేశం ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎంపీసీ సెకండియర్‌లో జి.సునందత 992, జి.సాక్షిత 985, బి.స్వాతి 981, సిహెచ్.మిన్ను–980. బీపీసీలో కె.అక్షయ–991, ఈ.యశ్వంత్ 988, బి.రాధిక 984, జి.స్పూర్తి 980 మార్కులు సాధించారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో పి.మోక్షిత–467, కె.అమూల్య–466, ఎం.ఇందు–466, ఎం.శ్రీజ–466. బీపీసీ ఫస్టియర్‌లో బి.శ్రావ్య– 429, పి.సాక్షిత–425 మార్కులు సాధించారు.
విజయభేరి మోగించిన ఆర్‌డీ కళాశాల
విజయభేరి మోగించిన ఆర్‌డీ కళాశాల
విజయభేరి మోగించిన ఆర్‌డీ కళాశాల
విజయభేరి మోగించిన ఆర్‌డీ కళాశాల


