భీమారం– సీతంపేట వరకు ఫోర్‌లేన్
హసన్‌పర్తి : భీమారం నుంచి సీతంపేట క్రాస్ వరకు ఫోర్‌లేన్ రోడ్డు నిర్మాణానికి రూ.50 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే కే. ఆర్.నాగరాజు తెలిపారు. హన్మకొండ–కరీంనగర్ ప్రధాన రహదారిలోని హసన్‌పర్తి తహసీల్ కార్యాలయం నుంచి పెద్ద చెరువు వరకు ప్రమాదకర ఏరియాలను బల్దియా మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డితో కలిసి ఎ మ్మెల్యే పరిశీలించారు. ప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఆయా విభాగాల అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం విస్తరణ, తాత్కాలిక డివైడర్లు, ఇరువైపులా వీధి దీపాల కోసం రూ.2 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. మే యర్ గుండు సుధారాణి మాట్లాడుతూ పది రోజుల్లో రోడ్డుకు ఇరువైపులా వీధి దీపాలు వేస్తామన్నారు. కుడా చైర్మన్ వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడుతూ జంక్షన్‌ల అభివృద్ధికి సిద్దంగా ఉన్నట్లు చెప్పారు.
ఐదేళ్లలో 45 మృతి చెందారు
ఐదేళ్ల కాలంలో ఈ రోడ్డులో 45 మంది మృతి చెందినట్లు ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. గాయపడిన వారి సంఖ్య వందల్లోనే ఉందన్నారు. పదేళ్ల కాలంలో పాలకులు మాత్రం అభివృద్ధి కోసం ఏమీ పట్టించుకోలేదన్నారు. అయితే కొంతమంది వ్యక్తులు కలిసి ఏర్పాటు చేసిన అభివృద్ధి కమిటీకీ ఎలాంటి అనుమతి లేదన్నారు. కమిటీ చెల్లదన్నారు. వారి వెంట కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పింగిలి వెంకట్రాంనర్సింహారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కనపర్తి కిరణ్, దేవస్థాన కమిటీ చైర్మన్ వెంకటస్వామి, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు ఉన్నారు.
ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటాం
ఆరోగ్యశ్రీలో వర్తించని వ్యాధులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు అన్నారు. నగరంలోని 1, 2, 3, 14, 43వ డివిజన్ పరిధిల్లో సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరైన చెక్కులను మంగళవారం హనుమకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. పీఏసీఎస్ చైర్మన్లు మేర్గు రాజేష్, గోపాల్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పొన్నాల రఘు, మాజీ సర్పంచ్ అనిల్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పెద్దన్న, ఏఎంసీ మాజీ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాత్కాలిక నిర్మాణానికి రూ.2 కోట్లు
మంజూరు
క్షేత్రస్థాయిలో రోడ్డు పరిశీలన


