
‘వైబ్రంట్ అకాడమీ’ విద్యార్థుల ప్రభంజనం
హన్మకొండ : ఇంటర్ ఫలితాల్లో హనుమకొండలోని వైబ్రంట్ అకాడమీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. మంగళవారం విడుదల చేసిన ఫలి తాల్లో తమ అకాడమీకి చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారని వైబ్రంట్ అకాడమీ చైర్మన్ సిరంగి శ్రీనివాస్, డైరక్టర్ సి.హెచ్.రాజేందర్ రెడ్డి తెలిపారు. ఫస్టియర్ ఎంపీసీలో వి.సాయిచంద్ర 467 మార్కులు, ఎన్.నిహాల్ 467, పి.శ్రీ మహార్ష 467, జి.జాహ్నవి 466, ఎం.రాంచరణ్ 466, ఎం.కార్తీక్ రెడ్డి 466, బీపీసీలో బి.వినాయక్ 435 మార్కులు, ఎ.హర్షిత 431, కే.సాయి 431 మార్కులు సాధించారని వివరించారు. ఎంపీసీలో 85 మంది విద్యార్థులు 400లకు పైగా, బీపీసీలో 15 మంది 350కి పైగా మార్కులు సాధించారని వివరించారు. రాజస్థాన్ కోటాకు చెందిన వైబ్రంట్ అకాడమీని వరంగల్‌లో స్థాపించి అనుభవజ్ఞులైన అధ్యాపకులతో నిరంతర పర్యవేక్షణ, యోగా, మోటివేషన్‌తో విద్యార్థులను తీర్చి దిద్దుతున్నామన్నారు. ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను చైర్మన్, డైరెక్టర్లు, అధ్యాపకులు అభినందించారు. కార్యక్రమంలో వైబ్రంట్ అకాడమి ప్రిన్సిపాల్ టి. శేషుకుమార్, అడ్మినిస్ట్రేషన్ హెడ్ జి.రఘుపతి, కోఆర్డినేటర్ రామ్ గుమ్మడి, అధ్యాపకులు పాల్గొన్నారు.