
ఇంటర్ ఫలితాల్లో ‘ఏకశిల’ విజయకేతనం
హన్మకొండ చౌరస్తా : తెలంగాణ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ 2024–25 ఫలితాల్లో హనుమకొండలోని ఏకశిల జూనియర్ కళాశాలల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశా రు. ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీలో పి.కావ్య 470 మా ర్కులకు 468, పి.సాయిగణేష్ 466, డి.సాయిరాజ్ 466, ఎం.గణేష్ 466 మార్కులు సాధించారు. బైపీసీలో టి. లాహిత 440 మార్కులకు 437, పి.అర్చన 437, పి.హాసిక 436, ఇ.అర్చన 436 మార్కులు సా ధించారు. సీఈసీలో ఎండీ.సానియా 500 మార్కులకు 488, ఎ.రష్మిక 487 సాధించగా ఎంఈసీలో టి.అశ్విత 495 మార్కులు సాధించారు. సెకండియర్ ఎంపీసీలో జే.ప్రతీశ్వర్ 1000 మార్కులకు 993, ఇ.మనోజ్ఞ 990 మార్కులు, బైపీసీలో డి.లక్ష్మీవైష్ణవి 990, సీఈసీలో సుమైయ తన్వీర్ 974 మార్కులతో విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్బంగా ఏకశిలా విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ఇంటర్ ఫలితాలతో పాటు పోటీ పరీక్షలైన జేఈఈ మెయిన్స్ 2025, నీట్, ఎంసెట్ ఫలితాల్లో అత్యత్తమ ఫలితాలను సాధించామని అన్నారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఎం.జితేందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్స్ సుధాకర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, రాజిరెడ్డి, బోధనా సిబ్బంది పాల్గొన్నారు.