సాక్షి, అమరావతి: కేంద్ర నిబంధనలకు లోబడే ఏపీ అప్పులు ఉన్నాయని సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి గత ప్రభుత్వం అప్పులు చేసిందన్నారు. కోవిడ్ సంక్షోభం కారణంగా ఏపీకి ఆర్థిక ఇబ్బందులు వచ్చాయన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా పూర్తిస్థాయిలో రాలేదన్నారు.
చదవండి: పలు రాష్ట్రాలకు ఏపీ ఆదర్శం: సీఎం జగన్
ఏపీలో ద్రవ్యలోటు చాలా తక్కువని వివరించారు. చంద్రబాబు హయాంలో ఏటా 19.4 శాతం అప్పులు ఉంటే.. ఇప్పుడు 15.77 శాతం మాత్రమే అప్పులు ఉన్నాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రూ.39 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని దువ్వూరి కృష్ణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment