Special Secretary
-
ఏపీ ఆర్ధిక పరిస్థితిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
-
AP: అప్పులపై తప్పుడు రాతలు.. దువ్వూరి కృష్ణ క్లారిటీ
సాక్షి, అమరావతి: కేంద్ర నిబంధనలకు లోబడే ఏపీ అప్పులు ఉన్నాయని సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి గత ప్రభుత్వం అప్పులు చేసిందన్నారు. కోవిడ్ సంక్షోభం కారణంగా ఏపీకి ఆర్థిక ఇబ్బందులు వచ్చాయన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా పూర్తిస్థాయిలో రాలేదన్నారు. చదవండి: పలు రాష్ట్రాలకు ఏపీ ఆదర్శం: సీఎం జగన్ ఏపీలో ద్రవ్యలోటు చాలా తక్కువని వివరించారు. చంద్రబాబు హయాంలో ఏటా 19.4 శాతం అప్పులు ఉంటే.. ఇప్పుడు 15.77 శాతం మాత్రమే అప్పులు ఉన్నాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రూ.39 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని దువ్వూరి కృష్ణ తెలిపారు. -
FRBM పరిమితికి మించి గత ప్రభుత్వం అప్పులు చేసింది: ఏపీ సీఎం ప్రత్యేక కార్యదర్శి
-
వరంగల్ ఓఆర్ఆర్ ల్యాండ్ పూలింగ్ రద్దు
సాక్షి, హైదరాబాద్ /వరంగల్ అర్బన్: వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్మాణ ప్రక్రియలో భాగంగా రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ (భూసమీకరణ) పద్ధతిలో భూములను సేకరించాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 41 కిలోమీటర్ల వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు కోసం వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని 28 గ్రామాల రైతుల నుంచి భూములు సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూములు సేకరించాలని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) గతంలో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు సర్వే పనులను ప్రారంభించింది. అయితే ల్యాండ్ పూలింగ్‌కు భూ యజమానుల సమ్మతి కోసం తెచ్చిన జీఓ 80ఏ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మూడు జిల్లాల పరిధిలో ఐదు నెలలుగా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. దీంతో ఇటీవల ‘కుడా’ వైస్ చైర్మన్ పి.ప్రావీణ్య భూ సేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటిం చారు. అయినప్పటికీ రైతులు ఆందోళనలు కొనసాగించారు. రహదారుల దిగ్బంధనం చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం ఎమ్మెల్యే ఆరూరి రమేష్ హైదరాబాద్‌లో మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. దీనిపై స్పందించిన కేటీఆర్ ల్యాండ్ పూలింగ్ విధానానికి స్వస్తి పలకాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను ఆదేశించారు. ఈ మేరకు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు అర్వింద్‌కుమార్ సోమవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. -
ప్రభుత్వాలు అప్పులు చేయడం సర్వసాధారణం
-
‘కేంద్రం, రాష్ట్రాలు అప్పులు చేయడం సర్వ సాధారణం’
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఫైనాన్స్ ఎకనమిక్ అఫైర్స్ స్పెషల్ సెక్రటరీ, దువ్వూరి కృష్ణ ఆరోపించారు. విభజన సమయం నుంచే రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. టీడీపీ హయాంలో అప్పులు బాగా పెరిగాయని, విద్య, వైద్య రంగాలను గత పాలకులు నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రాలు అప్పులు చేయడం సర్వ సాధారణమని, ప్రభుత్వం ఖర్చులు పెట్టడం వల్లే ఎకానమీ పెరిగిందన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను సరిగా వినియోగించి ఉంటే.. ప్రస్తుతం ఆర్థికభారం ఉండేదికాదని దువ్వూరి కృష్ణ తెలిపారు. కోవిడ్‌తో దేశవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని, 21 లక్షల కోట్లను కేంద్రం అప్పుగా తీసుకుందన్నారు. -
ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్‌గా ఎన్వీ రమణారెడ్డి..
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రత్యేక కమిషనర్, ఎక్స్ అఫిషియో కమిషనర్‌గా నియమితులైన ఎన్వి రమణారెడ్డి గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ భవన్లో బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ భవన్ అసిస్టెంట్ కమిషనర్లు, అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛా లతో ఆయనకు స్వాగతం పలికారు. ఐఆర్పీఎస్ (1986) బ్యాచ్ అధికారి అయిన రమణారెడ్డి ఇండియన్ రైల్వే లోను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రోటోకాల్ విభాగం సెక్రటరీగా, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం మాతృ సంస్థ అయిన ఇండియన్ రైల్వేలోని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ విభాగంలో పనిచేస్తూ తిరిగి డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన రమణారెడ్డిని న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రత్యేక కమిషనర్, ఎక్స్ అఫీషియో కమిషనర్, టూరిజం శాఖ కమిషనర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. -
ప్రత్యేక కార్యదర్శులకు సీఎస్ మెమో
సాక్షి, హైదరాబాద్: ఫైళ్లను పునఃపరిశీలించాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయానికి తిప్పిపంపిస్తున్న అన్నిశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి మంగళవారం మెమో జారీచేశారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత కార్యదర్శులదేనని అందులో పేర్కొన్నారు. ఇతర శాఖలతో సంబంధం లేని ప్రభుత్వ ఆదేశాలను ఆయాశాఖలు వారంరోజుల్లోగా అమలు చేయాలని, ఇతర శాఖలతో ము డిపడి ఉన్న ఆదేశాలైతే పక్షం రోజుల్లో అమలుచేయాల్సి ఉందని మెమోలో స్పష్టం చేశారు.