సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఫైనాన్స్ ఎకనమిక్ అఫైర్స్ స్పెషల్ సెక్రటరీ, దువ్వూరి కృష్ణ ఆరోపించారు. విభజన సమయం నుంచే రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. టీడీపీ హయాంలో అప్పులు బాగా పెరిగాయని, విద్య, వైద్య రంగాలను గత పాలకులు నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు.
కేంద్రం, రాష్ట్రాలు అప్పులు చేయడం సర్వ సాధారణమని, ప్రభుత్వం ఖర్చులు పెట్టడం వల్లే ఎకానమీ పెరిగిందన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను సరిగా వినియోగించి ఉంటే.. ప్రస్తుతం ఆర్థికభారం ఉండేదికాదని దువ్వూరి కృష్ణ తెలిపారు. కోవిడ్‌తో దేశవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని, 21 లక్షల కోట్లను కేంద్రం అప్పుగా తీసుకుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment