ఫైళ్లను పునఃపరిశీలించాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయానికి తిప్పిపంపిస్తున్న అన్నిశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి మంగళవారం మెమో జారీచేశారు.
సాక్షి, హైదరాబాద్: ఫైళ్లను పునఃపరిశీలించాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయానికి తిప్పిపంపిస్తున్న అన్నిశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి మంగళవారం మెమో జారీచేశారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత కార్యదర్శులదేనని అందులో పేర్కొన్నారు. ఇతర శాఖలతో సంబంధం లేని ప్రభుత్వ ఆదేశాలను ఆయాశాఖలు వారంరోజుల్లోగా అమలు చేయాలని, ఇతర శాఖలతో ము డిపడి ఉన్న ఆదేశాలైతే పక్షం రోజుల్లో అమలుచేయాల్సి ఉందని మెమోలో స్పష్టం చేశారు.