సాక్షి, సంగారెడ్డి: రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పార్టీ పొత్తు ఉండబోదని రాహుల్‌గాంధీ గతంలోనే చెప్పారని మాణిక్‌రావుఠాక్రే స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి దుష్ప్రచారం చేస్తున్నాయనీ ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళతామని చెప్పారు. ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి సోమవారం ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు సంగారెడ్డికి వచ్చిన ఠాక్రే మీడియాతో మాట్లాడారు.
దళిత సీఎం అంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ఠాక్రే వెంట ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్, నేతలు వి.హన్మంత్‌రావు, అజారుద్దీన్, పొన్నాల లక్ష్మయ్య, రోహిత్‌చౌదరి, మధుయాష్కిగౌడ్, మహేశ్‌కుమార్‌గౌడ్, కుసుమ్‌కుమార్ ఉన్నారు. కాగా, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరిక విషయమై విలేకరులు అడగగా, పారీ్టలోకి ఎవరైనా రావచ్చని, పొంగులేటి వస్తే ఆహా్వనిస్తామన్నారు.
చదవండి: తెలంగాణలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ నేతలను ఆరా తీసిన రాహుల్
Comments
Please login to add a commentAdd a comment