శరత్ బాబు చనిపోయారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ కావడంపై ఆయన సోదరి స్పందించింది. ఆ వార్తలు పూర్తిగా అసత్యమని కొట్టిపారేసింది. శరత్ బాబు చనిపోలేదని.. ఆయన ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది. త్వరలోనే కోలుకుంటారని ఆశిస్తున్నాం.' అని తెలిపారు. అయితే సోషల్ మీడియాలో పలువురు శరత్ బాబు చనిపోయినట్లు వైరల్ చేయడంతో తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చింది.
(ఇది చదవండి: ఆస్పత్రిలో చేరిన సీనియర్ నటుడు శరత్ బాబు!)
శరత్ బాబు సోదరి మాట్లాడుతూ..' సోషల్ మీడియాలో శరత్ బాబు గురించి వచ్చే వార్తలు అన్ని తప్పుగా వస్తున్నాయి. ఇప్పుడే కొంచెం రికవరీ అయి.. వేరే రూముకు షిఫ్ట్ చేయడం జరిగింది. తొందరలోనే శరత్ బాబు పూర్తిగా కోలుకుని మీ అందరితో మాట్లాడుతారని ఆశిస్తున్నా.' అని అన్నారు.
కాగా.. ఇటీవలే శరత్ బాబు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు త్వరగ కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
(ఇది చదవండి: చిరంజీవితో రొమాన్స్ చేయాలని ఉంది: స్టార్ హీరోయిన్)
మూడు సార్లు నంది అవార్డులు
శరత్ బాబు హీరోగా నటించిన తొలిచిత్రం 1973లో విడుదలైన రామరాజ్యం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కన్నెవయసు, పంతులమ్మ, అమెరికా అమ్మాయి చిత్రాల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాలో నటించి మంచి నటుడిగా పేరు సంపాదించారు. తర్వాత తెలుగులో బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన చిలకమ్మ చెప్పింది సినిమాలో నటించారు. కొన్నేళ్ల పాటు వెండితెరపై కనిపించిన శరత్ బాబు ప్రస్తుతం చాలా తక్కువగా కనిపిస్తున్నారు. శరత్ బాబు దాదాపు 220కి పైగా సినిమాల్లో నటించారు. మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment