
సన్నీ డియోల్ కుమారుడు కరణ్ డియోల్ ప్రస్తుతం వార్తల్లో ప్రధానంశంగా మారాడు. హిందీ పరిశ్రమతోపాటు సోషల్ మీడియాలో అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించి చర్చ నడుస్తోంది. ప్రముఖ డైరెక్టర్ బిమల్ రాయ్ మునిమనువరాలు ద్రిశాతో కరణ్ డియోల్‌కు ఎంగేజ్‌మెంట్ జరిగిందని బాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Karan Deol Engaged To Bimal Roy Great Granddaughter Here is The Truth: సన్నీ డియోల్ కుమారుడు కరణ్ డియోల్ ప్రస్తుతం వార్తల్లో ప్రధానాంశంగా మారాడు. హిందీ పరిశ్రమతోపాటు సోషల్ మీడియాలో అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించి చర్చ నడుస్తోంది. ప్రముఖ డైరెక్టర్ బిమల్ రాయ్ మునిమనువరాలు ద్రిశాతో కరణ్ డియోల్‌కు ఎంగేజ్‌మెంట్ జరిగిందని బాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారని బీటౌన్‌లో టాక్ నడుస్తోంది. అయితే ఈ వార్తలను కరణ్ డియోల్ బృందం కొట్టిపారేసింది. కరణ్ డియోల్‌కు నిశ్చితార్థం జరిగిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.
'కరణ్ డియోల్, ద్రిశలు ఇద్దరు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వారిద్దరికి ఎంగేజ్‌మెంట్ జరిగిందని వస్తున్న వార్తలు అవాస్తవం.' అని పేర్కొంది. కాగా 'పల్ పల్ దిల్ కే పాస్' మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు కరణ్ డియోల్. త్వరలో అనిల్ శర్మ దర్శకత్వంలో వస్తున్న 'అప్నే 2' చిత్రంలో అతని తండ్రి సన్నీ డియోల్‌తోపాటు ధర్మేంద్ర, బాబీ డియోల్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. ఇంతుకుముందు 2013లో వచ్చిన 'యమ్లా పగ్లా దివానా 2'లో సన్నీ, బాబీ, ధర్మేంద్ర ముగ్గురు నటించారు. ఈ మూవీకి రెండో యూనిట్ డైరెక్టర్‌గా కరణ్ డియోల్ పనిచేశాడు.
చదవండి: బాలీవుడ్‌పై మరోసారి ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్..
హాట్‌టాపిక్‌గా మారిన సల్మాన్ ఖాన్ తమ్ముడి విడాకులు