Bimal Roy
-
సన్నీ డియోల్ తనయుడికి నిశ్చితార్థమంటూ వార్తలు.. ఇదిగో క్లారిటీ
Karan Deol Engaged To Bimal Roy Great Granddaughter Here is The Truth: సన్నీ డియోల్ కుమారుడు కరణ్ డియోల్ ప్రస్తుతం వార్తల్లో ప్రధానాంశంగా మారాడు. హిందీ పరిశ్రమతోపాటు సోషల్ మీడియాలో అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించి చర్చ నడుస్తోంది. ప్రముఖ డైరెక్టర్ బిమల్ రాయ్ మునిమనువరాలు ద్రిశాతో కరణ్ డియోల్‌కు ఎంగేజ్మెంట్ జరిగిందని బాలీవుడ్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారని బీటౌన్‌లో టాక్ నడుస్తోంది. అయితే ఈ వార్తలను కరణ్ డియోల్ బృందం కొట్టిపారేసింది. కరణ్ డియోల్‌కు నిశ్చితార్థం జరిగిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. 'కరణ్ డియోల్, ద్రిశలు ఇద్దరు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వారిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగిందని వస్తున్న వార్తలు అవాస్తవం.' అని పేర్కొంది. కాగా 'పల్ పల్ దిల్ కే పాస్' మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు కరణ్ డియోల్. త్వరలో అనిల్ శర్మ దర్శకత్వంలో వస్తున్న 'అప్నే 2' చిత్రంలో అతని తండ్రి సన్నీ డియోల్‌తోపాటు ధర్మేంద్ర, బాబీ డియోల్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. ఇంతుకుముందు 2013లో వచ్చిన 'యమ్లా పగ్లా దివానా 2'లో సన్నీ, బాబీ, ధర్మేంద్ర ముగ్గురు నటించారు. ఈ మూవీకి రెండో యూనిట్ డైరెక్టర్‌గా కరణ్ డియోల్ పనిచేశాడు. చదవండి: బాలీవుడ్‌పై మరోసారి ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. హాట్‌టాపిక్‌గా మారిన సల్మాన్ ఖాన్ తమ్ముడి విడాకులు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'సినిమావాళ్లు బరితెగించారు'
ముంబై: 'సినిమాలు చూడాలంటేనే భయమేస్తోంది. మానవత్వం, సున్నితత్వం మచ్చుకైనా కనపడవు. తెరనిండా పాశ్చాత్య పోకడలు.. పొట్టపొట్టి దుస్తులు! పాత్రల్లో భారతీయత ఎక్కడుంది? సినిమాల వల్ల జనం కూడా కఠినంగా మారిపోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమావాళ్లు దారుణంగా బరితెగించారు. ఫిలింమేకింగ్ పచ్చి బిజినెస్ అయిందిప్పుడు. మాట్లాడితే 100 కోట్ల కలెక్షన్లు, లేదంటే తొలివారం రికార్డులు. బాబోయ్.. ఇవన్నీ నాకు ఎప్పటికీ అర్థంకాని విషయాలు. అందుకే అలాంటి చోట నేను ఉండలేను' అని బాలీవుడ్ సీనియర్ నటి, మెగాస్టార్ అమితాబ్ బచ్చన సతీమణి జయ బచ్చన్ అన్నారు. ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజెస్(మామి) 18వ సినీ ఉత్సవంలో భాగంగా దిగ్గజ దర్శకుడు బిమల్ రాయ్ సంస్మరణార్థం మంగళవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమలో జయ బచ్చన్ మాట్లాడారు. 50వ, 60 దశకాల్లో వచ్చిన సినిమాల్లో భారతీయ జీవం ఉట్టిపడేదని, రానురాను సినిమాల్లో పాశ్చాత్య అనుకరణ ఎక్కువైపోయిందని ఆమె అన్నారు. అయితే భారతీయుల ఆలోచనా విధానం ప్రగతిశీలంగానే ఉందని పేర్కొన్నారు. జనజీవితాలను ప్రతిబించించే కొన్ని సినిమాలు మాత్రం అద్భుతంగా అనిపిస్తాయని, మసాన్, అలీగఢ్ లాంటి సినిమాలు నిజమైన భారతీయ సినిమాలని, అలాంటివాటిని ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని జయ చెప్పారు.