romours
-
‘కమలం’ చెంతకు కమల్‌నాథ్?
న్యూఢిల్లీ/భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే అలాంటిదేమీ లేదని కమల్‌నాథ్ ఆ వార్తలను కొట్టిపారేశారు. అయితే శనివారం జరిగిన పరిణామాలు చూస్తుంటే ఆయన బీజేపీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషణలు వినవచ్చాయి. అసలేం జరిగింది? కమల్‌నాథ్‌కు మాజీ మీడియా సలహాదారు, ప్రస్తుత బీజేపీ అధికార ప్రతినిధి అయిన నరేంద్ర సలూజా.. కమల్‌నాథ్, ఆయన కుమారుడు, ఛింద్వారా కాంగ్రెస్ ఎంపీ నకుల్‌నాథ్‌లతో దిగిన భోపాల్‌లో దిగిన ఒక ఫొటోను ‘ఎక్స్’లో పోస్ట్‌చేసి దానికి ‘జై శ్రీరామ్’ అని ట్వీట్‌చేశారు. దీంతో తండ్రీకొడుకులు కమలం గూటికి చేరుకుంటున్నారని వార్తలు మొదలయ్యాయి. వీటికి బలం చేకూరుస్తూ నకుల్‌నాథ్ తన ‘ఎక్స్(పాత ట్విట్టర్)’ ఖాతా వివరాల్లో కాంగ్రెస్ పదాన్ని తొలగించారు. ముందస్తు షెడ్యూల్ లేకుండా హడావుడిగా ఇద్దరూ ఢిల్లీకి వచ్చారు. రాగానే మీడియా కమల్‌ను ప్రశ్నించింది. మీరు పార్టీ మారుతున్నారా? అన్న ప్రశ్నకు ‘‘ అలాంటిదేమైనా ఉంటే ముందు మీకే చెబుతా’ అని అన్నారుగానీ పార్టీని వీడట్లేదనే సమాధానం చెప్పలేదు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. రాజ్యసభ సీటు ఆశించి భంగపడినందుకే కమల్‌నాథ్ పార్టీని వీడుతున్నారని మరో విశ్లేషణ వినిపించింది. బీజేపీలోకి వస్తామంటే ఇప్పుడే మీకు స్వాగతం పలుకుతామని మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ వీడీ శర్మ శుక్రవారం వ్యాఖ్యానించడం తెల్సిందే. గత ఏడాది మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శనకు కమల్‌నాథ్ బాధ్యుడని రాహుల్ భావిస్తున్నారని, అందుకే కమల్‌ను తప్పించి జీతూ పట్వారీకి కాంగ్రెస్ మధ్యప్రదేశ్ చీఫ్ పదవి కట్టబెట్టారని వార్తలొచ్చాయి. అన్నీ అసత్యాలు : జీతూ పట్వారీ ఇలాంటి వార్తలను కాంగ్రెస్ మధ్యప్రదేశ్ అధ్యక్షుడు జీతూ పటా్వరీ తోసిపుచ్చారు. ‘‘ కాంగ్రెస్‌తో కమల్‌నాథ్ బంధం ఈనాటిది కాదు. ఇందిరాగాంధీ తనయుడు సంజయ్ గాంధీతో కలిసి డెహ్రాడూన్ డూన్ స్కూల్లో చదివారు. ఒకానొక సమయంలో కమల్ నా మూడో కుమారుడు అంటూ స్వయంగా ఇందిరగాం«దీనే వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్‌ను వీడుతారా?’’ అని మీడియానే పట్వారీ నిలదీశారు. ‘‘రాజ్యసభ సీటు ఇవ్వలేదన్నది అవాస్తం. నిజానికి ఆ స్థానం కోసం నామినేషన్ వేసిన పార్టీ కోశాధికారి అశోక్‌సింగ్ పేరును బలపరిచింది కమల్‌నాథే’’ అని పటా్వరీ వివరణ ఇచ్చారు. దశాబ్దాలుగా కాంగ్రెస్‌తో అనుబంధమున్న కమల్ ఛింద్వారా నుంచి తొమ్మిదిసార్లు ఎంపీగా గెలిచారు. 2019లో ఆ స్థానం నుంచి కమల్ కుమారుడు నకుల్ గెలిచారు. ఈ ఒక్కస్థానం తప్ప రాష్ట్రంలోని మిగతా 28 ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. -
సన్నీ డియోల్ తనయుడికి నిశ్చితార్థమంటూ వార్తలు.. ఇదిగో క్లారిటీ
Karan Deol Engaged To Bimal Roy Great Granddaughter Here is The Truth: సన్నీ డియోల్ కుమారుడు కరణ్ డియోల్ ప్రస్తుతం వార్తల్లో ప్రధానాంశంగా మారాడు. హిందీ పరిశ్రమతోపాటు సోషల్ మీడియాలో అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించి చర్చ నడుస్తోంది. ప్రముఖ డైరెక్టర్ బిమల్ రాయ్ మునిమనువరాలు ద్రిశాతో కరణ్ డియోల్‌కు ఎంగేజ్మెంట్ జరిగిందని బాలీవుడ్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారని బీటౌన్‌లో టాక్ నడుస్తోంది. అయితే ఈ వార్తలను కరణ్ డియోల్ బృందం కొట్టిపారేసింది. కరణ్ డియోల్‌కు నిశ్చితార్థం జరిగిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. 'కరణ్ డియోల్, ద్రిశలు ఇద్దరు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వారిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగిందని వస్తున్న వార్తలు అవాస్తవం.' అని పేర్కొంది. కాగా 'పల్ పల్ దిల్ కే పాస్' మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు కరణ్ డియోల్. త్వరలో అనిల్ శర్మ దర్శకత్వంలో వస్తున్న 'అప్నే 2' చిత్రంలో అతని తండ్రి సన్నీ డియోల్‌తోపాటు ధర్మేంద్ర, బాబీ డియోల్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. ఇంతుకుముందు 2013లో వచ్చిన 'యమ్లా పగ్లా దివానా 2'లో సన్నీ, బాబీ, ధర్మేంద్ర ముగ్గురు నటించారు. ఈ మూవీకి రెండో యూనిట్ డైరెక్టర్‌గా కరణ్ డియోల్ పనిచేశాడు. చదవండి: బాలీవుడ్‌పై మరోసారి ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. హాట్‌టాపిక్‌గా మారిన సల్మాన్ ఖాన్ తమ్ముడి విడాకులు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఫోటోగ్రాఫర్స్ కు ఫోజులివ్వనందుకే రాద్దాంతం:అంజలి
హైదరాబాద్: తాను పబ్ లో తాగి హల్ చల్ చేశానన్న వార్తలను నటి అంజలి ఖండించారు. ఓ వర్గానికి చెందిన మీడియా తనపై పనిగట్టుకుని బురదచల్లే యత్నం చేస్తోందని ఆమె మండిపడింది. ఆదివారం మీడియాతో మాట్లాడిన అంజలి.. తాను తబలా రెస్టారెంట్ కు వెళ్లిన మాట వాస్తవమేనని.. అయితే అక్కడ తాగి ఏదో చేశానని మీడియా హడావుడి చేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. 'నేను ఫ్రెండ్స్ కలిసి శుక్రవారం తబలా రెస్టారెంట్ కు వెళ్లాను. మా ఫ్రెండ్స్ తో పాటు వారి భర్తలు కూడా వచ్చారు.ఈ క్రమంలోనే కొంతమంది మీడియా ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు తీసుకోవడానికి నన్ను సంప్రదించారు. అయితే ఆ సమయంలో వారి విన్నపాన్ని మర్యాద పూర్వకం తిరస్కరించాల్సి వచ్చింది. ఇలా తిరస్కరించిన 15 నిమిషాల్లోనే లేనిపోని రూమర్లు కొన్ని టెలివిజన్ ఛానెల్ లో వచ్చాయి. ఇది కేవలం ఆ ఫోటోగ్రాఫర్లు సృష్టించిందే. ఇందులో ఎటువంటి వాస్తవం లేదు' అని అంజలి తెలిపింది.