ఫోటోగ్రాఫర్స్ కు ఫోజులివ్వనందుకే రాద్దాంతం:అంజలి | actress Anjali rubbishes rumours about being in pub brawl | Sakshi
Sakshi News home page

ఫోటోగ్రాఫర్స్ కు ఫోజులివ్వనందుకే రాద్దాంతం:అంజలి

Published Sun, Jan 25 2015 2:09 PM | Last Updated on Wed, Apr 3 2019 9:04 PM

ఫోటోగ్రాఫర్స్ కు ఫోజులివ్వనందుకే రాద్దాంతం:అంజలి - Sakshi

ఫోటోగ్రాఫర్స్ కు ఫోజులివ్వనందుకే రాద్దాంతం:అంజలి

హైదరాబాద్: తాను పబ్ లో తాగి హల్ చల్ చేశానన్న వార్తలను నటి అంజలి ఖండించారు. ఓ వర్గానికి చెందిన మీడియా తనపై పనిగట్టుకుని బురదచల్లే యత్నం చేస్తోందని ఆమె మండిపడింది. ఆదివారం మీడియాతో మాట్లాడిన అంజలి.. తాను తబలా రెస్టారెంట్
కు వెళ్లిన మాట వాస్తవమేనని.. అయితే అక్కడ తాగి ఏదో చేశానని మీడియా హడావుడి చేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. 'నేను ఫ్రెండ్స్ కలిసి శుక్రవారం తబలా రెస్టారెంట్ కు వెళ్లాను. మా ఫ్రెండ్స్ తో పాటు వారి భర్తలు కూడా వచ్చారు.ఈ క్రమంలోనే కొంతమంది మీడియా  ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు తీసుకోవడానికి నన్ను సంప్రదించారు.

 

అయితే ఆ సమయంలో వారి విన్నపాన్ని మర్యాద పూర్వకం తిరస్కరించాల్సి వచ్చింది. ఇలా తిరస్కరించిన 15 నిమిషాల్లోనే లేనిపోని రూమర్లు కొన్ని టెలివిజన్ ఛానెల్ లో వచ్చాయి. ఇది కేవలం ఆ ఫోటోగ్రాఫర్లు సృష్టించిందే. ఇందులో ఎటువంటి వాస్తవం లేదు' అని అంజలి తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement