
నాకే క్లారిటీ లేదు
గవర్నర్ పదవిపై మోత్కుపల్లి
నల్లగొండ రూరల్: గవర్నర్ పదవిపై తనకే క్లారిటీలేద ని, వచ్చినప్పుడు విషయం చెబుతానని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. సోమవారం నల్లగొండలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలు, మండలాల విభజన శాస్త్రీయంగా జరగడం లేదని తెలిపారు. యాదగిరిగుట్టను జిల్లాగా చేయడం శుభపరిణామమన్నారు. మండల వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కిందన్నారు. ఆలేరు నియోజకవర్గంలోని గుండాల, ఆలేరు, రాజాపేట మండలాలను జనగాం డివిజన్‌లో కలపొద్దన్నారు. ఈ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చినట్లు చెప్పారు.