న్యూఢిల్లీ: రైళ్లలో బేబీ బెర్తులను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభలో శుక్రవారం(ఆగస్టు2) వెల్లడించారు. రైల్వే కోచ్‌లలో బేబీ బెర్త్‌లను అమర్చే ఆలోచన ఉందా అని ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు వైష్ణవ్ సమాధానమిచ్చారు. లక్నో మెయిల్‌లో రెండు బేబీ బెర్త్‌లను పైలట్ ప్రాజెక్టు కింద తీసుకువచ్చామన్నారు.
మెయిల్‌లోని ఒక బోగీలో రెండు లోయర్ బెర్త్‌లకు బేబీ బెర్త్‌లను అమర్చామని తెలిపారు. దీనిపై ప్రయాణికుల నుంచి ప్రశంసలు వచ్చాయన్నారు. అయితే సీట్ల వద్ద సామాన్లు పెట్టుకునే స్థలం తగ్గిపోవడం, సీట్ల మధ్య దూరం తగ్గిపోవడం లాంటి సమస్యలొచ్చాయన్నారు. అయితే ప్రయాణికుల కోచ్‌లలో మార్పులు చేయడమనేది నిరంత ప్రక్రియ అని మంత్రి అన్నారు.
కాగా,రైళ్లలో లోయర్ బెర్త్‌లకు అనుబంధంగా ఉండే బేబీ బెర్త్‌లపై తల్లులు తమ పిల్లలను పడుకోబెట్టుకోవచ్చు. దీనివల్ల ఒకే బెర్త్‌పై స్థలం సరిపోక ఇబ్బందిపడే బాధ తల్లిపిల్లలకు తప్పుతుంది.
Comments
Please login to add a commentAdd a comment